రమేష్ పట్నాయక్ అఖిల భారత విద్యా హక్కు వేదిక
జులై 29వ తేదీన కేంద్ర ప్రభుత్వం జాతీయ విద్యావిధానాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై అనేక వార్తాకాథనాలు వచ్చాయి. చర్చోపచర్చలు జరుగుతున్నాయి. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ రమేష్ పోఖియాల్ దీనిని ఒక అపూర్వమైన విధ్యావిధానంగా అభివర్ణించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ విద్యావిధానం భారత దేశాన్ని ఒక విజ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్ద గలదని ప్రశంసించారు. కాంగ్రెస్ తదితర జాతీయ పార్టీలు దేశ భవిష్యతను రూపొందించే విద్యావిధానాన్ని రూపొందించడంలో పార్లమెంటును ప్రక్కన పెట్టడాన్ని తీవ్రంగా ఖండించాయి. ఈ విధానంలో మౌలిక అంశాలు పరిశీలించాలి.
ఈ నూతన విద్యావిధానంలో భాగంగా మానవ వనరుల అభివృద్ధి శాఖను తిరిగి విద్యాశాఖగా మార్పు చేయడం, పూర్వ ప్రాథమిక విద్యను తప్పనిసరి చేయడం, సెకండరీ మరియు హైయ్యర్ సెకండరీ విద్యలను కలిపివేని మొత్తాన్ని సెకండరీ విద్యగా పరిగణించడం, పాఠశాల విద్యను 5+3+3+4 గా పునర్వ్యవస్థీకరించడం, పాఠశాలలో పాఠ్య మరియు సహపాఠ్య, ప్రకృతి మరియు సామాజిక శాస్త్రాలు, అకడమిక్ మరియు వొకేషనల్ అనే అడుగోడలను తొలగించడం వంటి విషయాలు ఉన్నాయి. అలాగే, ఉన్నత విద్యలో యం. ఫిల్ కోర్సులను రద్దుచేయడం, మల్టిపుల్ ఎక్జిట్ ను ప్రవేశపెట్టడం, ఉన్నత విద్యా కోర్సులలో ఛాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ అనే విధానాన్ని ప్రవేశపెట్టడం, టెక్నికల్ విశ్వవిద్యాలయాలు, మెడికల్ విశ్వవిద్యాలయాలు, అగ్రికల్చరల్ విశ్వవిద్యాలయాలు వంటి అధ్యయన విషయాల వారీ విశ్వవిద్యాలయాల పద్ధతి కాక ప్రతి విశ్వవిద్యాలయంలో అన్ని అధ్యయన విషయాలు ఉండాలని, పరిశోధనకు మరింత ప్రాధాన్యత ఇవ్వాలని, బి.ఇ.డి మరియు యం.ఇ.డి కోర్సులు అనేవి బహుళ అధ్యయన విషయాలు ఉండే విశ్వవిద్యాలయాలలో మాత్రమే భాగంగా ఉండాలని, విశ్వవిద్యాలయాల బయట ఉన్న ప్రతి కళాశాల స్వయం ప్రతిపత్తిగల కళాశాలగా మారాలని ఇంకా అనేక వ్యవస్థాత్మక విషయాలు ఈ విధానంలో ఉన్నాయి. మరి ఇవన్నీ మంచి చర్యలేనా అడిగితే ముఖ విలువను బట్టి చెప్పడం కష్టం. విద్యావ్యాపారం పునాదిలో ఉన్నప్పుడు మూడు ఇంకా అదనంగా పాలకుల చూపు గతం వైపు ఉన్నప్పుడు చెడు విధానాలు అమలు అవుతాయి మరియు మంచి విధానాలు వికటిస్తాయి. 1986 నాడు కాంగ్రెస్ వారు తీసుకువచ్చిన జాతీయ విద్యావిధానంలో కూడా కొన్ని మంచి ప్రతిపాదనలు ఉండినాయి. అయితే అవి కాగితాలకే పరిమితం అయ్యాయి కాగా వారి అసలు అజండా, విద్యావ్యాపారీకరణ మాత్రం బేషుగ్గా అమలు జరిగింది. 1986 విధానం వలనే ఈ విధానంలో కూడా కొన్ని అనుకూల విషయాలతో పాటు పాలకుల ప్రధానమైన అజండా కూడా ఉంది.
నేడు భారత దేశంలో విద్యారంగం ఎదురొంటున్న ప్రధాన సమస్య విద్యావ్యాపారం. మరి ఈ నూతన విద్యావిధానం విద్యావ్యాపారాన్ని నిషేధిస్తుందా? ఈ విషయమై కస్తూరి రంగన్ నివేదికలో ఉన్న అరకొర ప్రకటనలు కూడా కేంద్ర మంత్రివర్గం ఆమోదించి విడుదల చేసిన ప్రస్తుత విధాన పత్రంలో లేవు. ప్రైవేటు యాజమాన్యాలు విద్యను ఒక లాభాపేక్ష లేని సంస్థగానే నడపాలి అనే ఒక ఆదర్శం మాత్రం ఈ విధానంలో ప్రకటించారు. ఇటువంటి ఆదర్శాల ప్రకటన వలన ఎంతమాత్రం ప్రయోజం ఉండదని వేరుగా చెప్పనవసరం లేదు. విద్యావ్యాపారాన్ని వ్యతిరేకిస్తూ గతంలో మోహినీ జైన్ వర్సస్ కర్నాటక రాష్ట్ర ప్రభుత్వం కేసులో జస్టిస్ కుల్దీప్ సింగ్ ఇచ్చిన తీర్పులో ఏమన్నారంటే 'ఒక సొసైటీ గానీ లేదా ఒక ట్రస్టుగాని విద్యా సంస్థను స్థాపించవచ్చు మరియు నడువపచ్చు కాని తాము ప్రభుత్వ బాధ్యతను పంచుకుంటున్నామని వారు అర్ధం చేసుకోవాలి, ఫలానా కోర్సుకు ప్రభుత్వ విద్యాసంస్థలో ఎంత ఫీజు ఉందో అంతకంటే ఎక్కువ ఫీజు వసూలు చేయకూడదు.' సదరు తీర్పు అర్ధం ఏమిటి విద్యలో వ్యాపారం కూడదు. దాతృత్వ సంస్థలు తమ స్వంత నిధులతో విద్యను సుమారు ఉచితంగా అందించవచ్చు అని ఆ తీర్పు అర్ధం. అయితే ప్రస్తుత నూతన విద్యా విధానంలో ప్రైవేటు విద్యాసంస్థలు ప్రభుత్వ రంగం కంటే ఎక్కువ ఫీజులు వసూలు చేయకూడదని ఎక్కడా చెప్పలేదు. ఇక ఈ విధానం విద్యావ్యాపారాన్ని నిషేధించకపోయినా కనీసం నియంత్రిస్తుందా అంటే అదీ లేదు. పైగా ఒక పాఠశాలకు లేదా ఒక కళాశాలకు ఇంత స్థలం ఉండాలి, గదులు ఇంత విశాలంగా ఉండాలి వంటి అమలులో ఉన్న నిబంధనలు రద్దు చేయాలని ఈ విధానం నిర్దేశిస్తున్నది. ప్రైవేట్ యాజమాన్యాల వారు తమ విద్యాసంస్థలో ఏఏ వసతులు ఉన్నాయో వాటిని వెబ్ సైట్ లో పారదర్శకంగా ప్రదర్శిస్తే చాలని ఈ విధానం పేర్కొంటుంది. ఫీజు నియంత్రణకు అక్రిడిటేషన్ గ్రేడ్లు వారిగా గరిష్ట పరిమితులు నిర్ణయించబడతాయి అని పేర్కొనడం జరిగింది. అంటే ఫీజు పెంచుకోవాలంటే ప్రైవేటు యాజమాన్యాలు పై స్థాయి గ్రేడ్ కొరకు ప్రయత్నించుకుంటే సరిపోతుందన్న మాట. అక్రిడిటేషన్ రంగంలో కూడా ప్రైవేటు సంస్థలు రాబోతున్నాయి కాబట్టి అది పెద్ద సమస్య " కాకపోవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ విధానం విద్యావార్యపారాన్ని నిషేధించడం లేదు సరికదా, పరిమితంగా ఉన్న నియంత్రణలను కూడా నీరుగారుస్తున్నది. కాంగ్రెస్ తెచ్చిపెట్టిన విద్యావ్యాపారానికి అదనంగా ఈ బి.జె.పి నాయకత్వాన గల ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం దాతృత్వాన్ని ప్రోత్సహించాలి అనే పేరుతో దాతృత్వ సంస్థలుగా చెప్పుకునే సంస్థలకు ప్రభుత్వ నిధులను ధారాదత్తం చేయనున్నది. ఈ విధానం పేరు పబ్లిక్ ఫిలాంత్రఫిక్ పార్ట్నర్షిప్ (పి.పి.పి). ఈ విధానం పాలక పక్ష భావజాల సంస్థలకు నిధులను మళ్ళించడానికి రూపొందించబడిందనే విమర్శ వినిపిస్తుంది.
ఈ విద్యావిధానం కొంట్రొత్త సమస్యలను ముందుకు తీసుకు వస్తుంది. ఈ విధ్యావిధానం రాజ్యాంగంలో పొందుపరచబడిన రిజర్వేషన్లకు కూడా చెల్లుచీటి ఇచ్చింది. మొత్తం విధాన పత్రంలో విద్యార్థులకు సీట్లు కేటాయించే విషయంలో మరియు విద్యా సంస్థల ఉద్యోగాల నియామకం అన్న విషయంలో రిజర్వేషన్ అన్న పదమే లేదు. సామాజికి న్యాయం గురించి వ్రాసారు. కాని అది ఆర్థిక సహకారానికి ఇతర సహకారాలకు కుదించబడింది. విధాన పత్రంలో రిజర్వేషన్లు ఉండవు అని వ్రాయలేదు, కాని ఉంటాయని కూడా వ్రాయలేదు. ప్రధానంగా ఈ మధ్యనే సుప్రీం కోర్టు రిజర్వేషన్లు ప్రాథమిక హక్కు కాదు అనే ధోరణిలో వ్యాఖ్యానించిన నేపథ్యంలో ప్రభుత్వం యొక్క విధాన పత్రం కూడా అసందిగ్ధంగా లేకపోవడం అనేక ప్రశ్నలకు చోటిస్తున్నది. ఇక ఉపాధ్యాయుల మరియు అధ్యాపకుల పదోన్నతుల విషయానికి వస్తే ఆ సందర్భంలో కూడా రిజర్వేషన్ల ప్రస్తావన లేకపోవడమే గాక, సీనియారిటీ గురించిన ప్రస్తావన లేదు. విద్యా సంస్థల వారీగా నియామకాల విధానాలు రూపొందించుకునే విధానం మరియు ప్రొబేషన్ విధానం ప్రవేశపెట్టాని నిర్దేశించబడింది. పనితీరుపై ఆధారపడి ఉద్యోగాన్ని ఖరారు చేయడం, పదోన్నతుల ఇచ్చే విధానం ఉండాలని నిర్దేశించబడింది. నాయకత్వ లక్షణాలను ముందుగానే గుర్తించి వారి అభివృద్ధికి ప్రత్యేకమైన నచ్చనలు (అడ్స్ని కల్పించాలని పర్కానబడింది. మరొక విషయం, షయం, పదోన్నతులలో నాయకత్వ లక్షణాలకు, విద్యా సంస్థ అభివృద్ధి ఎడల నిబద్దతకు మరియు సామాజిక సంబంధాలకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్దేశించబడింది. మరి కొలవడానికి వీలుకాని నాయకత్వ లక్షణాలు, నిబద్దత మరియు సామాజిక సంబంధాలకు పదోన్నతు లలో ప్రాధాన్యత ఇస్తే అది ఆత్మాశ్రయ నిర్ణయాలకు దారితీయదని ఎలా చెప్పగలం. పదోన్నతులలో రిజర్వేషన్లకు, సీనియారిటీకి చివరికి విద్యార్హతలకు కూడా చోటు ఉండదేమో అనే ఆందోళనలు వ్యక్తం అవు తున్నాయి. ఈ విధానం సార్వత్రిక నిబంధనల స్థానంలో అధిపతుల విచక్షణాధికారానికి ఎక్కువ పాత్ర కల్పించింది. అంటే రిజర్వేషన్లు, సీనియారిటీ మరియు రూల్ ఆఫ్ లా ప్రశ్నార్థకం | అవుతాయన్నమాట.
ఈ జాతీయ విద్యావిధానం 2020 | ప్రధాన లక్షణాలలో అధికార కేంద్రీకరణ | ఒకటి. పాఠశాల విద్యకు వస్తే ఈ విధానం ప్రకారం పాఠ్యపుస్తకాలను కూడా కేంద్రమే రూపొందిస్తుంది. కేంద్రం పంపిన పాఠ్య గ్రంధాలలో ఎటువంటి మార్పులు చేయకూడదు. రాష్ట్రాలు సప్లిమెంటరీలు మాత్రం ప్రచురించుకోవచ్చు. మునుపెన్నడూ లేని విధంగా పాఠ్య వస్తువు కేంద్రీకరణ జరుగుతుంది. ఇక ఉన్నత విద్య విభాగంలో వైద్యవిద్య మరియు న్యాయవిద్య తప్పించి మిగిలిన వ్యవస్థను అంతటినీ నియంత్రియంచడానికి ఒక 'హయ్యర్ ఎడ్యుకేషన్ కమీషన్ ఆఫ్ ఇండియా' ఏర్పాటు చేయబడుతుంది. ఇది తన నాలుగు సరిక్రొత్త అంగాలు 1) యన్.హెచ్.ఇ.ఆర్.సి ; 2) యన్.ఏ.సి; 3) హెచ్.ఇ.జి.సి; 4) జి.ఇ.నీ ద్వారా ఉన్నత విద్యా వ్యవస్థను నియంత్రించడం, విద్యా సంస్థలకు అక్రిడిటేషన్ ఇవ్వడం, నిధులు మంజూరు చేయడం మరియు ఉన్నత విద్యా కోర్సులను రూపొందిడం మరియు వాటి ప్రమాణాలను నిర్దేశించడం చేస్తుంది, 1948 నాటి రాధాకృష్ణ కమీషన్ విశ్వ విద్యాలయాలు నియంత్రించబడకూడదు. న్యాయస్థానాల వలెనే అవి కూడా స్వయంప్రతిపత్తి కలిగి ఉండాలని భావించింది. విశ్వవిద్యాల యాలు స్వయం నియంత్రితం కావాలని భావించింది. అందుకే యూనివర్శిటీ రెగ్యులేటరీ కమిటీని నియమించాలని సిఫారసు చేయలేదు. యూనివర్శిటీ గ్రాంట్స్ కమీషను ఏర్పాటు చేయాలని మాత్రమే చెప్పింది. అనాటి ప్రభుత్వం అలాగే చేసింది. అయితే ఇప్పుడు నూతన విద్యా విధానం ప్రకారం పైన చెప్పినట్లు విశ్వవిద్యాలయాలను నియంత్రించడానికి ఒక కమీషన్ ఏర్పడబోతూంది. విశ్వవిద్యాలయాలను ప్రభుత్వాలు నియంత్రించడం ఎడల మనకు అభ్యంతరం లేకపోతే మిగిలినవన్నీ వివరాలే. కొత్త సంస్థల ఏర్పాటు, ఉన్న సంస్థల పేరు మార్పు మరియు అధికారాల పునఃపంపిణీ మాత్రమే. ఎన్ని సంస్థలున్నా హైయ్యర్ ఎడ్యుకేషన్ కమీషన్ ఆఫ్ ఇండియా అనేది దేశవ్యాప్తంగా ఉన్న ఉన్నత విద్యను నియంత్రిస్తుంది. అధికార కేంద్రీకరణకు ఈ విధానం బలమైన ప్రాతిపదికలు కలిగి ఉందని స్పష్టంగా చెప్పవచ్చు. విశ్వవిద్యాలయాల నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వాల మరియు రాష్ట్ర స్థాయి ఉన్నత విద్యా సమితుల పాత్ర నామమాత్రం చేయబడింది. ఇది రాష్ట్రాల ఫెడరల్ హక్కులకు భంగకరమైనది. ఈ విషయంపై ప్రాంతీయ పార్టీలు స్పందిస్తాయి అని భావిద్దాం. ఈ విధానంలో ముందు వెనుకలుగా ప్రతి యూనివర్శిటికీ ఒక బోర్డు ఆఫ్ గవర్నరు ఏర్పాటు చేస్తారు. విశ్వవిద్యాలయంపై సర్వాధికారాలు ఈ బోర్డు ఆఫ్ గవర్నరకు ఉంటాయి. మరి ఈ బోర్డు ఆఫ్ గవర్నర్స్ పాలక పార్టీ వ్యక్తులతో నింపబడుతుందని విశ్వవిద్యాలయాలు పాలక పార్టీల వస్తుగత మరియు భావజాల ప్రయోజనాలకు కేంద్రంగా మారుతాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
సాధారణంగా విద్య అనేది మార్పుకు చోదక శక్తిగా భావించ బడుతుంది. కాని ఈ విధాన పత్రం విద్యావ్యవస్థ సంప్రదాయాలను కాపాడే విధంగా రూపొందించబడాలని నిర్దేశిస్తుంది. దేశ సంస్కృతిలో అంతర్ ఘర్పణను గాని, కాలంతరంలో మార్పును గాని అలాగే స్థలాంతరంలో వైవిధ్యాన్ని కాని ఈ విధాన పత్రం నమోదుచేయలేదు. సంస్కరణోద్యమ ముందుకాలానికి చెందిన సాంఘిక దురాచారాలనే భారతీయ సంస్కృతి అని భావించి వాటిని కాపాడడం విద్యారంగ కర్తవ్యంగా ధృవీకరిస్తే విద్య అనేది అంధకారంవైపు ప్రయాణం అవుతుంది. ఏది ఏ ఏది ఏమైనా ఈ విధానంపై ఒక లోతైన చర్చ జరగాలి.