చైనాతో అమెరికా ప్రారంభించిన ప్రచ్ఛన్న యుద్ధం
డి.వి.కృష్ణ
నగరంలోని చైనా కాన్సులేట్ జనరల్ కార్యాలయాన్ని, 72 గంటల్లోగా మూసి వేయాలని, అమెరికా ప్రభుత్వం, చైనాను ఆదేశించింది. దీనితో, చైనాతో అగ్రరాజ్యం అమెరికా ప్రారంభించిన ప్రచ్ఛన్న యుద్ధం తీవ్ర రూపం దాల్చింది. వాస్తవానికి, రెండు సంవత్సరాల క్రిందటనే అమెరికా, చైనాపై తీవ్ర స్థాయిలో వాణిజ్య యుద్ధాన్ని ప్రారంభించింది. కోవిద్ సంక్షోభం ప్రారంభమైనప్పటి నుండి, తాను తీసుకుంటున్న వరుస చర్యలతో అమెరికా, చైనాతో తాను సాగిస్తున్న వాణిజ్య యుద్ధాన్ని, సర్వవ్యాపిత ప్రచ్ఛన్న యుద్ధంగా మార్చివేసింది. ఇప్పుడు, హౌస్టన్లోని తన కాన్సులేట్ కార్యాలయాన్ని మూసివేయాలని అమెరికా యిచ్చిన ఆదేశంతో, వీరి మధ్య దౌత్య యుద్ధం తీవ్ర రూపానికి చేరుకుంది. ఈ అసంబద్ద చర్యను వుపసంహరించుకోవాలని చైనా ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని పెడచెవిన పెట్టడంతో, చైనా కూడా, ప్రతి చర్యగా చెంగ్డూలోని అమెరికా కన్సురేట్ జనరల్ కార్యాలయాన్ని కూడా 72 గంటల లోపు మూసివేయాలని ఆదేశించాల్సి వచ్చింది. ఈ రెండు దేశాల కార్యాలయాల మూసివేతలు పూర్తయ్యాయి. ఇంతటితో కూడా ఆగకుండా, అమెరికా ప్రభుత్వం, కొందరు చైనా విద్యార్థులను, తమ దేశ వ్యాక్సిన్ పరిశోధనా రహస్యాలను దొంగిలించారనే సాకుతో అరెస్టు చేసింది. దౌత్య మర్యాదలను, అంతర్జాతీయ న్యాయ సూత్రాలను వుల్లంఘించి, తమ అధికారులను చైనా కన్సులేట్ కార్యాలయంలోకి పంపించి వీరంగం సృష్టించింది.
కరోనా వ్యాక్సిన్ సమస్య
ప్రస్తుతం, ప్రపంచ దేశాల మధ్య కరోనా వ్యాక్సిన్ తయారీ విషయంలో తీవ్రమైన పోటీ నెలకొని వుంది. ఎవరు ముందు తయారు చేస్తారు? ఎవరు, మంచి ఫలితాన్నిచ్చే విధంగా తయారు చేస్తారు? ఎవరు చౌకగా తయారు చేస్తారు? ఎవరు, ప్రపంచంలో ఎక్కువ ఆర్డర్లు సంపాదించి అమ్ముకోగలుతారు? ఇది, వేలు, లకల కోట్ల డాలర్ల వ్యాపారం. ప్రపంచంలో యిప్పుడు 25 కంపెనీలు వ్యాక్సిన్ల తయారీ ప్రక్రియలో వివిధ దశలలో వున్నాయి. ప్రతి దశ ప్రయోగాలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతి అవసరమవుతుంది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో వివరిలో ఒక వ్యాక్సిన్ తయారీ ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనిని 'ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్' అని పిలుస్తున్నారు. దీనిని యూరోపియన్ ఫార్మస్యూటికల్ కంపెనీ ఆస్ట్రా జైనికా స్పాన్సర్ చేస్తున్నది. అమెరికాకు చెందిన బిల్ గేట్స్ కంపెనీ, ఈ వ్యాక్సిన్ కొనుగోలు కోసం ఒప్పందం కుదుర్చు ఈ కంపెనీతో ఒప్పందం చేసుకుంది. భారత దేశంలో కూడా రెండు వ్యాక్సిన్ తయారీ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. అహ్మదాబాద్ కేంద్రంగా వున్న కేండిలా హెల్త్ కేర్, హైదరాబాద్ కేంద్రగా వున్న భారత్ బయో టెక్ సంస్థలు ఫేస్-1, ఫేస్-2 పరీక్షలకు అనుమతి పొందాయి. రష్యా కూడా ఒక వ్యాక్సిన్ తయారీలో వుంది. పెన పేరొన్న 25 వ్యాక్సిన్ల పరిశోధనలలో 5 మాత్రమే ఫేస్-2 పరీక్షలను పూర్తి చేసుకొని పేస్-3 పరీకల నిర్వహణ దశలో వున్నాయి. మూడవ పేజీలో, వేల సంఖ్యలో ప్రజలపై ప్రయోగాలు జరుగుతాయి. ముఖ్యంగా వయోవృదుల మీద, దీర్ఘకాలిక జబ్బులు వున్న వారి మీద ప్రయోగాలు చేస్తారు. వీటిలో 3 కంపెనీలు చెనాకు చెందినవి. పరిశోధనలో, చెనా, తమ కన్నా ముందున్నదనే ఈ ర్యా, ద్వేషాలతో, అమెరికా, చైనా మీద తమ పరిశోదనా పలితాలను దొంగిలించారనే తప్పుడు ఆరోపణలకు పూనుకుంటున్నది. కొన్ని యూరోపియన్ దేశాలు, రష్యా మీద కూడా యిలాంటి ఆరోపణలకు పూనుకున్నాయి. తమ మీద ఆరోపణలు నిరాధారమైనవనీ, దురుద్దేశ పూరితమైనవనీ, పరిశోధనలో, ప్రయోగాలలో ముందు వరుసన తామే వుండగా, తాము యితరుల పరిశోధనా ఫలితాలను దొంగిలించాల్సిన అవసరమేమిటనీ చైనా ప్రశ్నించింది. పైగా, చెనా అధ్యక్షుడు, జిన్ పింగ్ తాము కనిపెటే వ్యాక్సిన్‌ను ప్రపంచ సొత్తు' (world good)గా మారుస్తామని, అందరికీ అందుబాటు చేస్తామని ప్రకటించాడు. తమ వ్యాక్సిన్లను వ్యాపారం చేసుకొని లక్షల కోట్లు లాభాలు గడించాలనుకునే కంపెనీలకు, దేశాలకు, చైనా కన్నెర్రగా మారటంలో ఆశ్చర్య మేముంది?
చైనాతో వ్యాపారంలో, అమెరికా లోటు సమస్య
అమెరికా - చైనాల మధ్య వ్యాపారంలో, అమెరికా భారీ లోటును, చైనా భారీ మిగులును, వరుసగా నమోదు చేస్తూ రావటం, అమెరికాకు మింగుడు పడని సమసంగా వుంటూ వచ్చింది. టం అధికారంలోకి వచ్చిన తర్వాత, 'అమెరికా ఫస్ట్', 'అమెరికాను మళ్లీ గొప్ప దేశంగా మారుసా' లాంటి నినాదాలు యిసూ వచ్చాడు. 'స్వేచ్చా వ్యాపార పోటీ'లో చైనాను ఓడించటం సాధ్యం కాదని అర్థం చేసుకున్న ట్రంప్, చైనా, 'తన దేశంలో పనిచేస్తున్న అమెరికా కంపెనీల సాంకేతిక పరిజ్ఞానాన్ని బలవంతాన స్వంతం చేసుకుంటున్నదనే ఆరోపణతో, చైనా నుండి వచ్చే దిగుమతుల మీద భారీగా పన్నులు విధించటానికి పూనుకున్నాడు. చైనా కూడా, దీనికి ప్రతి చర్యగా అమెరికా నుండి దిగుమతుల మీద పన్నులు విధించింది. అమెరికా, రెండవసారి, మళ్లీ భారీగా పన్నులు పెంచటం, చైనా, దీనికి ప్రతి చర్యలు తీసుకోవటం - గత రెండు సంవత్సరాలలో జరిగింది. రెండు దేశాల మధ్య ఇదొక వ్యాపార యుద్ధంగా మారింది. ఇది, ప్రపంచ వ్యాపారం మీద తీవ్రమైన వ్యతిరేక ప్రభావాన్ని కల్గించింది. అమెరికా వ్యవసాయోత్పత్తులకు చైనా ఒక పెద్ద మార్కెట్. చైనా నుండి దిగుమతులలో, అమెరికా పరిశ్రమల్లో వినియోగించే ముడి పదార్థాలు, సెమి-ప్రాసెస్సుడు అంశాలు అనేకం వున్నాయి. పర్యవసానంగా, అమెరికా పారిశ్రామిక వేత్తల నుండి, రైతాంగం నుండి చైనాపై వ్యాపార ఆంక్షలను సడలించాలనే వత్తిడులు వచ్చాయి. ఫలితంగా అమెరికా, చైనాతో మరొకసారి వ్యాపార చర్చలను సాగించింది. కొన్ని సడలింపులకు, యిరు పక్షాల మధ్య అంగీకారం కుదిరింది. మళ్లీ, ఈ అక్టోబరులో మరో వరుస చర్చలు జరపాలని యిరుపక్షాలు నిర్ణయించుకున్నాయి. ఇంతలో, అమెరికా-చైనా సంబంధాలు దారుణంగా దిగజారాయి. ఇప్పుడీ చర్చలు జరుగుతాయో, లేదో అనే విషయంలో సందిగ్ధత నెలకొని వుంది.
కోవిడ్-19 సంక్షోభం తలెత్తక ముందు వరకు, అమెరికా, చైనాకు వ్యతిరేకంగా, ప్రధానంగా, వాణిజ్య యుద్దానికి పరిమితమయింది. కాని, అవిడ్ సంక్షోభం ప్రారంభం నుండి, దాని దాడి సర్వతోముఖ రూపం కోవిడ్ సంక్షోభం ప్రారంభం నుండి, దాని దాడి సర్వతోముఖ రూపం తీసుకుంది. గిల్లికజ్జా పెట్టుకునే ధోరణితో అమెరికా వ్యవహరించసాగింది. చైనా మీద దాడి చేయటానికి, నిత్యం యేదో ఒక సాకును వెతకటం ప్రారంభించింది. రోజూ, ఏదో ఒక రాయి విసరటం ప్రారంభించింది. హౌస్టన్లోని చైనా కాన్సులేట్ ఆఫీసు మూసివేత ఆదేశంతో యిది పరాకాష్టకు చేరింది.
కొవిడ్ సంక్షోభం - అమెరికా ఘోర వైఫల్యం
కోవిడ్ సంక్షోభాన్ని చైనా ప్రభుత్వం ముందుగా గుర్తించి, దానిని అదుపు చేయటానికి కఠినమైన చర్యలకు పూనుకుంది. ఫలితంగా, రెండు నెలల్లోనే, దీనిని అదుపు చేసి, మళ్లీ పారిశ్రామిక, సేవా, పర్యటన, రవాణా రంగాలను పునరుద్ధరించగల్గింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, కోవిడ్-19ను అవగాహన చేసుకోవడంలోనూ, అదుపు చేయడంలోనూ పూర్తిగా విఫలమయ్యాడు. ఇది మామూలు 'ఫ్లూ' లాంటిదేనని ఒకసారి, క్లోరోక్విన్ గోలీలు వేసుకుంటే తగ్గి పోతుందని మరోసారి, ఇది తొందరలోనే అదృశ్యమై పోతుందని యింకోసారి, బాక్టీరియా నిర్మూలన ఇన్ఫెక్టెంట్లను వాడితే నయమవుతుందని మరొకసారి, మాస్కులు అవసరం లేదని ఒకసారి, లా డౌన్లు అవసరం లేదని మరొకసారి - యిష్టానుసారం, బాధ్యతా రహితమైన ప్రకటనలు చేస్తూ వచ్చాడు. అమెరికా లాంటి ధనవంతమైన అగ్రరాజ్యం తీవ్రమైన మాస్కుల కొరతను, వెంటిలేటర్ల కొరతను యెదుర్కొని క్రిందు, మీద కావలసి వచ్చింది. వ్యాధి సోకుతున్న వారి సంఖ్యలోనూ, చనిపోతున్న వారి సంఖ్యలోనూ అమెరికా, ప్రపంచంలోనే నంబరు-1 స్థానానికి చేరుకోవటమే కాకుండా, ఆ స్థానంలోనే నిలకడగా కొనసాగుతూ వచ్చింది. ఈ పరిస్థితుల్లో, ట్రంప్ కు, తన వైఫల్యానికి ఒక కుంటి సాకు కావలసి వచ్చింది. ఒక బలిపశువు కావలసి వచ్చింది. దీనితో, అతడు 'కరోనా వైరసను చైనా తన దేశంలో సృష్టించి, ప్రపంచం మీదికి వదిలింద'నే దుర్మార్గమైన ఆరోపణకు పూనుకున్నాడు. దీనికి 'చైనా వైరస్' అని 'ఊహాన్ వైరస్' అని అతడు పేరు పెట్టి, చైనాను అపఖ్యాతి పాల్గేయటానికి పూనుకున్నాడు. తమ పరిశోధనా బృందాలను, చైనా లాబొరేటరీలను తనిఖీ చేయటానికి అనుమతించాలని, చైనాను డిమాండ్ చేశాడు. తమ దేశాలకు కల్గిన నష్టానికి చైనా పరిహారం చెల్లించాలని ట్రంప్ డిమాండ్ చేశాడు. తమ దేశంలో వ్యాధి గుర్తించబడగానే, చైనా అంతర్జాతీయ సమాజానికి తెలియజేయకుండా సమాచారాన్ని దాచి పెట్టిందని, అమెరికా ఆరోపించింది. చైనా తమకు సరైన సమయంలోనే సమాచారం యిచ్చిం దని, తాము ప్రపంచ దేశాలను సరైన సమయంలోనే హెచ్చరించామని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యు. హెచ్.ఓ) ప్రకటించినందుకు, చైనా సకాలంలో సరైన చర్యలు తీసుకొని కరోనాను అదుపు చేసిందని అభినందింనందుకు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ప్రపంచ ఆరోగ్య సంస్థపై మండి పడ్డాడు. అది, చైనాకు తొత్తుగా వ్యవహరిస్తుందని విమర్శించాడు. ప్రపంచ ఆరోగ్య సంస్థకు తమ వాటా నిధులను నిలిపి వేస్తూనూ, దాని నుండి వైదొలగుతూనూ ట్రంప్ తల బిరుసు ప్రకటన చేశాడు. ఆ
అమెరికా ఆరోపణలన్నిటికీ, చైనా దీటుగా జవాబిచ్చింది. ఏ వైరనూ ఒక ప్రాంతానికో, ఒక దేశానికి అంటగట్టకూడదని ప్రపంచ ఆరోగ్య సంస్థ యిచ్చిన నిర్దేశాన్ని చైనా వుటంకించింది. గతంలో సార్స్ వైరస్ అమెరికాలో పెట్టి, యితర దేశాలకు వ్యాప్తి చెందిందని, అంత మాత్రాన దానిని 'అమెరికా వైరస్' అని తాము పిలవలేదని చైనా వివరణ యిచ్చింది. అమెరికా నుండి వ్యాపించిన వైరస్లకు నష్ట పరిహారం చెల్లించాలన్న ఆదేశాన్ని, ఆనాడు ఎవరూ డిమాండు చేయలేదని చైనా గుర్తు చేసింది. కోవిద్ - 19 వైరసు మూలాలు కనుక్కోవటానికి తమకు అభ్యంతరం లేదని, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలలో యిందుకు పరిశోధనలు జరిగితే తాము సహకరిస్తామని చైనా ప్రకటించింది.
కోవిద్-19 వైరసన్ను తాము గుర్తించగానే 2020 జనవరి 3న ప్రపంచ ఆరోగ్య సంస్థకు సమాచారమిచ్చామని చైనా తెలియజేసింది. కోవిడ్-వైరస్ ఒక అంతర్జాతీయ ఆరోగ్య సమస్య అని, దానిని ప్రపంచ దేశాలన్నీ పరస్పర సహకారంతో యెదుర్కోవాలని, యిందుకు అంతర్జాతీయ సమాజంతో తాము పూర్తిగా సహకరిస్తామని చైనా ప్రకటిం చింది. అమెరికా కాని, పశ్చిమ దేశాలు కానీ, కోవిదను అరికట్టడానికి పటిష్టమైన చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యాన్ని ప్రదర్శించి, తమ మీద నిందలు వేసి త నిందలు వేసి తప్పించుకో చూడటం కాని, తమ దేశ ప్రజల దృష్టిని మళ్లించటానికి చూడటం కాని సరైనది కాదని చైనా హితవు చెప్పింది.
అమెరికా, ఇతర పశ్చిమ దేశాలన్నిటిలోనూ ఆరోగ్య వ్యవస్థంతా ప్రైవేటీకరించబడింది. ప్రజా ఆరోగ్య వ్యవస్థ పూర్తిగా బలహీన పర్చబడింది. కరోనా ఇతర జబ్బుల లాంటిది కాదు. వ్యక్తి ప్రయోజనాలకే సంబంధించినది కాదు. దీనిని గుర్తించటం, పరీక్షలు చేయటం, వైద్యం చేయటం - సామాజిక ప్రయోజనానికి సంబంధించిన విషయం. ప్రజలందరి ఆరోగ్య పరిరక్షణకు సంబంధించిన విషయం. ఈ సమస్య పరిష్కార బాధ్యతను, గరిష్ట లాభాలు సంపాదించటమే లక్ష్యంగా పనిచేసే ప్రయివేటు వైద్యరంగం పరిష్కరించలేదు. నయా వుదారవాద విధానాలలో భాగంగా, ప్రభుత్వ ఆరోగ్య రంగం యిప్పటికే ప్రయివేటీకరించ బడింది. ఇప్పటికిప్పుడు ఆఘమేఘాల మీద ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థను యేర్పాటు చేసి, ప్రజలందరికీ వుచిత వైద్య సౌకర్యాలు కల్పించటం సాధ్యం కాదు. కనుక, అమెరికా, యూరపు దేశాలు, నయా వుదారవాద విధానాలను అనుసరిస్తున్న భారత్ లాంటి దేశాలు లాక్ డౌన్లైతే ప్రకటించాయి. కాని 'వ్యాధి గుర్తింపు, పరీక్షలు, వైద్యం' చర్యలను కంటి తుడుపుగానే చేస్తున్నాయి తప్ప, సంపూర్తిగా నిర్మూలించే చర్యలను చేపట్టలేక పోతున్నాయి. .
లా డౌన్లు శాశ్వత పరిష్కారం కాజాలవు. వ్యాధిని నిర్మూలించే వరకు తీసుకోవలసిన తాత్కాలిక చర్యలు మాత్రమే. వ్యాధిని అదుపు చేయకుండా లాక్ డౌనులు యెత్తివేస్తే, వ్యాధి మళ్లీ విజృంభిస్తుంది. వ్యాధి విజృంభిస్తే, మళ్లీ పూర్తి లా డౌన్లకు పోవలసి వస్తుంది. పూర్తి లా డౌనులు ఆర్థిక సంక్షోభానికి, సాంఘిక సంక్షోభానికి దారి తీస్తాయి. చైనాలో ప్రభుత్వం, మొదట, ఖచ్చితమైన లా డౌన్ అమలు జరిపి, ఈ కాల వ్యవధిలో కోవిడ్ పూర్తిగా అదుపుకు చర్యలు తీసుకోగల్గింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో, ఒక సామాజిక బాధ్యతగా దీనిని నిర్వహించి నందువల్ల మాత్రమే యిది సాధ్యమయింది. దీనితో, చైనా తన ఆర్థిక వ్యవస్థను పూర్తిగా తెరవగల్గింది. ఉత్పత్తిని, ఉపాధిని ఎక్కువ శాతం పునరుద్దరించగల్గింది. ఇటీవలి త్రైమాసికాలలో 3.2% ఆర్థికాభివృద్ధిని సాధించి, ప్రపంచంలోనే రికార్డును సృష్టించగల్గింది. అమెరికా, యూరపు దేశాలు, చైనా నుండి సరైన గుణపాఠాలు తీసుకోవటానికి సిద్ధంగా లేవు. మరోప్రక్క, చైనా పట్ల ద్వేష భావాన్ని పెంచుకొని, దుష్పచారాలకు లంకించుకున్నారు. చైనాను నిందించినందువల్ల ఈ దేశాల కరోనా సంక్షోభమూ పరిష్కారం కావటం లేదు. వారి ఆర్థిక వ్యవస్థలూ పునరుద్దరణకు నోచుకోవటం లేదు. ఇన్ ఫెక్షనులూ, మరణాలూ ప్రమాదకర స్థాయికి పెరిగి పోతున్నాయి. ఆర్థిక సంక్షోభమూ తీవ్రతరమవుతున్నది. అనేక దేశాలు మళ్లీ “పూర్తి లాక్ డౌన్లు” ప్రకటిస్తున్నాయి. దేశం మొత్తంగానో, కొన్ని ప్రాంతాలలోనో “అత్వవసర పరిస్థితులను” ప్రకటిస్తున్నాయి. “ జాతీయ విపత్తుల”ను ప్రకటిస్తున్నాయి. ఈ వైఫల్యాలకు మూల విరాటుగా వున్న అమెరికా, ప్రజల దృష్టిని మళ్లించటానికి, చైనాపై యిలాంటి ఆరోపణలకు పూనుకుంటున్నా, దీనిని ఎవరూ నమ్మే పరిస్థితి లేదు.
చైనా, మైనారిటీ ప్రజల మానవ హక్కులను వుల్లంఘిస్తున్నదనే ఆరోపణ
దీనితో అమెరికా, మరో ఆరోపణకు లంకించుకుంది. చైనాలోని క్సిన్ జియాంగ్ ఉగర్ మైనారిటీ ప్రజల స్వయం పాలిత ప్రాంతంలో చైనా ప్రభుత్వం మానవ హక్కుల వుల్లంఘనకు పూనుకుంటున్నదని ఆరోపించింది. బలవంతపు జనాభా నియంత్రణకు పూనుకుంటున్నదని, యిందువల్ల వీరి జనాభా తగ్గిపోయిందని ఆరోపించింది. ఈ ఆరోపణ పచ్చి అబద్దమని, ఈ ప్రాంతపు యిటీవల జనాభా పెరుగుదల రేటు జాతీయ జనాభా పెరుగుదల రేటు కన్నా, ఎక్కువగా వుందని పేర్కొంది. చైనాపై అబద్ధపు ఆరోపణ చేస్తున్న అమెరికాలో మొదటి నివాసులైన నేటివ్ ఇండియన్ల జనాభా 1842లో (కొలంబస్ అమెరికాను కనిపెట్టిన సంవత్సరం) 6 కోట్లు వుండింది. ఆ సంఖ్య ఈనాటికి 52 లక్షల, 22 వేలకు దారుణంగా తగ్గిపోయిన వాస్తవాన్ని చైనా ప్రభుత్వం గుర్తు చేసింది.
క్సిన్ జియాంగ్ ప్రాంతంలోని మైనారిటీ ప్రజలను జైళ్లలో నిర్బంధించి, వారి శరీర భాగాలను, చైనా ప్రభుత్వం బలవంతాన సేకరిస్తున్నదని మరో ఆరోపణ అమెరికా చేసింది. ఇది మరో పచ్చి అబద్దమని చైనా కొట్టి వేసింది. 'చైనాలో శరీర భాగాలను విరాళంగా సేకరించటానికి నిర్దిష్ట చట్ట నిబంధనలున్నాయని, వాటిని చైనా ప్రభుత్వం ఖచ్చితంగా అమలు చేస్తున్నదని పేర్కొంది. శరీర భాగాలను విరాళంగా యివ్వటానికి ప్రజలు పెద్ద యెత్తున ముందుకు వస్తున్నారని, కనుక, ఎవరి నుండి నిర్బంధంగా శరీర భాగాలను సేకరించవలసిన అవసరమే తమకు లేదని కూడా చైనా ప్రభుత్వం పేర్కొంది.
కొన్ని పారిశ్రామిక సంస్థలు, ముస్లిం మైనారిటీ మహిళలతో బలవంతపు శ్రమ చేయించుకుంటున్నారని మరో ఆరోపణను అమెరికా చేసింది. ఈ పేరుతో కొన్ని సంస్థలపై, అమెరికా కొన్ని ఆంక్షలను విధించింది. వీరు స్వచ్చందంగానే పని చేస్తున్నారని, ఈ పేరుతో, అమెరికా వీరి ఉపాధి హక్కుకు భంగం కల్గిస్తున్నదని చైనా ప్రభుత్వం విమర్శించింది. అమెరికా, బానిస విధానంతోనే అభివృద్ధి చెందిందని, ఈ నాటికీ అక్కడ, నల్లజాతి అమెరికన్ల పట్ల వివక్ష చూపించబడున్నదని, వేలాది మంది ప్రతి సంవత్సరం ఘోరంగా హత్య చేయబడుతున్నారని అమెరికాలోనూ, ప్రపంచ దేశాలలోనూ అమెరికా జాత్యహంకారానికి వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తుతుంటే, అమెరికా పాలకులు చైనాపై వేలు చూపించటం హాస్యాస్పదంగా వుందని, చైనా విమర్శించింది.
క్సిన్ జియాంగ్ ప్రాంతంలో, కొన్ని మౌఢ్య ముఠాలు టెర్రరిస్టు చర్యలకు పూనుకుంటున్నాయని, దేశం నుండి వేర్పాటు కుట్రలకు పూనుకుంటున్నాయని, కొన్ని అశాస్త్రీయ, తాంత్రిక భావాలను ప్రచారం చేస్తున్నాయని, వీటికి వ్యతిరేకంగా చట్టబద్ద చర్యలకు మాత్రమే పూనుకుంటున్నామని చైనా ప్రభుత్వం వివరించింది. అమెరికా, కొన్ని యూరపు దేశాలు, ఆస్ట్రేలియా, ఈ ముఠాలకు అంతర్జాతీయ స్థావరాలను కల్పిస్తున్నాయని, నిధులను సమకూరుస్తున్నాయని, వీటికి అనుకూలంగా ప్రచారాన్ని సాగిస్తున్నాయని చైనా ప్రభుత్వం వివరించింది.
చైనా, తన దేశంలోని మైనారిటీ తెగల, మతాల ప్రజల పట్ల, యెంతో ప్రగతిశీల, ప్రజాస్వామిక దృక్పథంతో వ్యవహరిస్తున్నదని, వీరి సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధను కనపరుస్తున్నదని పేర్కొంది. క్సిన్ జియాంగ్ ఉగర్ స్వయం పాలిత ప్రాంతంలోని ప్రజలు, చైనా విముక్తి చెందే నాటికి యెంతో వెనుకబాటు తనంలోను, పేదరికంలోనూ మ్రగ్గుతుండే వారని, చైనా విముక్తి చెందినప్పటి నుండి వీరి అభివృద్ధికి యెంతో కృషి జరిగిందని చైనా ప్రభుత్వం పేర్కొంది. 2014 నుండి ఈ ప్రాంత ప్రజలలో 2.38 మిలియనుల మందిని పేదరికం నుండి బయటకు తీసుకు రావటం జరిగిందని, 2014 ప్రారంభంలో, ఈ ప్రాంత జనాభాలో 22.84% మంది పేదరికంలో వుండగా, 2019 నాటికి, వీరి శాతం 6.5%కి తగ్గిపోయిందని చైనా ప్రభుత్వం పేర్కొంది. ఈ ప్రాంత బడ్జెట్టులో 70 శాతాన్ని ప్రజల సంక్షేమాన్ని మెరుగు పర్చటానికి వుపయోగిస్తున్నామని పేర్కొంది. హైస్కూలు వరకు ఉచిత విద్యను కల్పిస్తున్నామని, కాలేజీ విద్యకు సబ్సిడీలు కల్పిస్తున్నామని చైనా ప్రభుత్వం పేర్కొంది. సబ్సిడిపై, ఒక్క సంవత్సరంలో 2,12,700 కుటుంబాలకు ఇళ్లు నిర్మించామని, 2018 నుండి, 22 కౌంటీలలో, 3,76,100 కుటుంబాలకు ఇళ్లు నిర్మించి పెట్టామని చైనా ప్రభుత్వం పేర్కొంది. కాలేజీ గ్రాడ్యుయేట్లకు వుపాధి అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పింది.
చైనా విధానాల పట్ల ఎవరికైనా అభ్యంతరాలుండొచ్చు. విమర్శలూ వుండొచ్చు. కాని, ఈ కారణంతో, ఆ దేశంపై నిషేధాలు విధించటం సరయింది కాదు. ఇలా చేయటం, ఆ దేశ ఆంతరంగిక వ్యవహారాలలో జోక్యం చేసుకోవటం మాత్రమే అవుతుంది. అమెరికా, పశ్చిమ దేశాలు, చైనాపై దురుద్దేశపూరితంగా తప్పుడు ఆరోపణలు చేయడమే కాకుండా, ఆ దేశానికి వ్యతిరేకంగా కుట్రలు, కుతంత్రాలకు పూనుకుటున్నాయి. అమెరికా, ఏకంగా, పార్లమెంటులో, 'క్సిన్ జియాంగ్ మానవ హక్కుల మానవ హక్కుల వుల్లంఘన చట్టం' పేరుతో ఒక చట్టాన్ని ఆమోదింపచేసింది. పై సాకుతో చైనాపై ఆంక్షలు విధించటానికి వుద్దేశించబడిందీ చట్టం. ఇది బరి తెగింపు చర్య మాత్రమే. అమెరికా ఆధిపత్య విధానానికీ, యితర దేశాల ఆంతరంగిక విధానాలలో జోక్యం చేసుకునే విధానానికి ఇదొక మచ్చుతునక మాత్రమే.
హాంకాంగ్ సమస్య
1840-1842 మధ్య ఆంగ్లేయులు చైనాపై నల్ల మందు యుద్ధాన్ని చేశారు. బ్రిటీషు సామ్రాజ్యవాదులు, భారత దేశంలో రైతులతో బలవంతాన నల్లమందు పండింపచేసి, దానిని తీసుకుపోయి చైనాలో రహస్యంగా అమ్ముకోవటం సాగించారు. ఆనాటి చైనా రాచరిక ప్రభుత్వం, నల్ల మందు వ్యాపారాన్ని నిషేధించింది. దీనితో, బ్రిటీషు వారు, చైనా ప్రభుత్వంపై యుద్ధం సాగించి, దానిని ఓడించారు. చైనా ప్రభుత్వం తప్పనిసరై నల్లమందు వ్యాపారాన్ని అనుమతించాల్సి వచ్చింది. 1842లో బ్రిటన్, చైనాల మధ్య నాంకింగ్ ఒప్పందం జరిగింది. ఈ ఒప్పంద షరతులలో భాగంగా హాంకాంగు ద్వీపాన్ని, చైనా, బ్రిటన్‌కు అప్పగించవలసి వచ్చింది. తర్వాత జరిగిన అనేక ప్రజా పోరాటాల నేపధ్యంలో 1898 జూన్ 9న జరిగిన ఒప్పందం ద్వారా, బ్రిటన్, హాంకాంగ్ ఆక్రమణను 99 సంవత్సరాల కౌలుగా మార్చటం జరిగింది. కౌలు వ్యవధి 1997లో అప్పగించవలసి వచ్చింది. తనకు స్వాధీనమయ్యే నాటికి హాంకాంగ్ లో పెట్టుబడి దారీ ఆర్థిక వ్యవస్థ, బూర్జువా రాజకీయ వ్యవస కొనసాగుతున్నందువల్ల 'ఒక దేశం - రెండు వ్యవస్థలు' అనే విధానాన్ని చైనా అమలు జరుపుతూ వచ్చింది అంటే, చైనాలో సోషలిస్టు వ్యవస్థ, ఏక పార్టీ పాలన వున్నప్పటికీ, హాంకాంగ్ మాత్రం స్వేచ్చా పెట్టుబడిదారీ విధానం, బహుళ పార్టీ బూర్జువా ప్రజాస్వామ్యం కొనసాగుతాయన్న మాట. అయితే, హాంకాంగ్, చైనాలో అంతర్భాగం అనే విధానాన్ని మాత్రం ప్రశ్నించటానికి వీల్లేదు. హాంకాంగ్ భద్రత చైనా ప్రభుత్వం చేతుల్లో వుంటుంది. కాని, గత ఒకటి - రెండు సంవత్సరాలుగా, అమెరికా, బ్రిటన్ ప్రభుత్వాలు హాంకాంగ్ కుట్రలు చేస్తూ వచ్చాయి. తమ ఏజంట్లతో, హాంకాంగ్ స్వతంత్రం కోసం పోరాటాన్ని చేయిస్తూ వచ్చారు. చైనాను ఒంటరి చేసే విధానంలో భాగంగా, ఈ మధ్య కాలంలో హాంకాంగ్ లో కుట్రలు, కుతంత్రాలు సాగిస్తూ వచ్చారు. పర్యవసానంగా యిటీవల జరిగిన చైనా జాతీయ కాంగ్రెసు సమావేశం ఒక ఆంతరంగిక భద్రతా బిల్లును ఆమోదించింది. దీని ప్రకారం, చైనా నుండి విడిపోవాలని ఆందోళన చేయటం, టెర్రరిస్టు కార్యకలాపాలకు పూనుకోవటం, ఆంతరంగిక శాంతికి భంగం కల్గించటం శిక్షారమైన నేరాలవుతాయి. ఈ చట్టం కారణంగా, అమెరికా, బ్రిటన్ కుట్రలు, కుతంత్రాలకు ఆటంకం యేర్పడింది. దీనితో, అమెరికా బ్రిటన్ ప్రభుత్వాలు, హాంకాంగ్ తో వున్న ప్రత్యేక ఆర్థిక సంబంధాలను, ఒప్పందాలను రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటనలు చేస్తున్నాయి. ఇవి, చైనా ఆంతరంగిక వ్యవహారాల్లో నగ్నమైన జోక్యమూ, రెచ్చగొట్టే చర్యలూ మాత్రమే.
తైవాన్ సమస్య
1949లో, కొమింటాంగ్ పార్టీ పై విజయం సాధించి, చైనా కమ్యూనిస్టు పార్టీ విప్లవాన్ని విజయవంతం చేసింది. అప్పుడు, కొమింటాంగ్ పార్టీ నాయకుడు చాంగ్-కై-షేక్ చైనా నుండి తైవాన్ దీవికి పారిపోయి, అక్కడొక అమెరికా తొత్తు ప్రభుత్వాన్ని యేర్పాటు చేశాడు. అమెరికా ప్రభుత్వ పలుకుబడితో, తైవాన్లోని చాంగ్-కై-షేక్ ప్రభుత్వాన్నే నిజమైన చైనా ప్రభుత్వంగా ఐరాస గుర్తించింది. తైవాను సెక్యూరిటీ కౌన్సిల్ లో కూడా సీటు లభించింది. కాని, మావో నాయకత్వంలోని చైనా ప్రభుత్వం, ఒక బలమైన ఆర్థిక శక్తిగా, రాజకీయ శక్తిగా మారటంతోనూ, అత్యధిక ప్రపంచ దేశాలు, దానినే నిజమైన చైనాగా గుర్తించటంతోనూ, అమెరికా ప్రభుత్వం దిగివచ్చి, 1970లో చైనా ప్రజా రిపబ్లికెనే నిజమైన చైనా ప్రభుత్వంగానూ, తైవానను చైనాలో అంతర్భాగంగానూ గుర్తిస్తూ ప్రకటన చేసింది. ఐ.రా.స. భద్రతా సమితిలో తైవానను తప్పించి, చైనాకు స్థానం కల్పించారు. ఇటీవలి దాకా, అమెరికా ప్రభుత్వం, యిదే విధానాన్ని అమలు జరిపింది. ఇప్పుడు, ప్రస్తుత అద్యక్షుడు ట్రంప్, తైవాను ఎక్కడలేని ప్రాధాన్యత యిస్తన్నాడు. ఇటీవల తైవాన్ అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన సాయి ఇంగ్ వెన్ను నూతన అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు అభినందనలు తెలియజేస్తూ ప్రకటన చేశాడు. ఇది కూడా చైనాను పనికట్టుకొని రెచ్చగొట్టే మరో చర్య.
దక్షిణ చైనా సముద్రంలో అమెరికా కవ్వింపు చర్యలు
దక్షిణ చైనా సముద్రం, చైనా, వియత్నాం బ్రూనో, హాంకాంగ్, తెవాన్, ఫిలిప్పీన్స్, ఇండోనీషియా, మలేషియా, సింగపూర్ దేశాల తీరాలను కలిగి వుంది. ఈ దేశాలన్నిటిలోనూ చైనా పెద్ద దేశం. హాంకాంగ్, తెవాన్లు కూడా చైనాలో అంతర్భాగాలే. దక్షిణ చైనా సముద్రం నుండి అమెరికా 8304 మైళ్ల దూరంలో వుంది. దానికీ, దక్షిణ చైనా సముద్రంలో సహజ ప్రయోజనాలేవీ లేవు. ఈ సముద్రానికి చెందిన అంతర్జాతీయ జలాల ద్వారా సరుకులు రవాణా చేసుకునే హక్కు మాత్రమే. ప్రపంచంలో అన్ని దేశాలతో పాటు దానికి వుంది. కాని, అమెరికా, ప్రపంచ పోలీసుగా తనను తాను భావించుకుంటుంది. ప్రపంచ మంతటి మీదా, అన్ని దేశాల మీద, సముద్రాల మీద, ఆకాశంలోనూ తనకు గుత్తాధిపత్యం వుందని అది భావిస్తుంది. చైనా, అమెరికాల మధ్య, దక్షిణ చైనా సముద్రంలో వివాదానికి, అమెరికా ఆధిపత్య ధోరణే కారణం. చైనాను చుట్టివేసి, ఏకాకిని చేయటానికే జపాన్, ఫిలిప్పీన్స్, దక్షిణ కొరియా, తైవాన్ దేశాలలో అమెరికా తన సైనిక శిబిరాలను కొనసాగిస్తున్నది. చైనా, రెండవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా యెదగటం పట్ల, తన ఆధిక్య స్థానాన్ని కూడా సవాలు చేస్తుండటం పట్లా, దానికి భరించలేనంత కడుపు మంటగా వుంది. అందుకే, అది, దక్షిణ చైనా సముద్రంలో తాను ఒంటరిగానూ, ఇతర దేశాలతో కలిసి విమాన వాహక సైనిక యుద్ధ నౌకలతో విన్యాసాలు సాగిస్తూ, అమెరికా-చైనాల మధ్య ఘర్షణలు చోటు చేసుకునే ప్రమాదాన్ని సృష్టిస్తున్నది. ఏ క్షణమైనా యుద్ధం బ్రద్దలయ్యే ముప్పును కొనితెస్తున్నది. ఇందుకు, అది, కొన్ని కుంటి సాకులు చెప్తున్నది. దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో, చైనా అన్యాయమైన క్లెయిములు చేస్తున్నదని, యితర దేశాల హక్కులకు భంగం కల్గిస్తున్నదని వాదిస్తున్నది. .
ఇటీవల, దక్షిణ చైనా సముద్రంలో, అమెరికా సైనిక కార్యకలాపాలు ఊపందుకున్నాయి. అమెరికా యుద్ధ నౌకలు, జలాంతర్గాములు, యుద్ధ విమానాల వునికి బాగా పెరిగింది. 2009తో పోలిస్తే, అమెరికా యుద్ధ ఓడల సంఖ్య 60 శాతం పెరిగింది. యుద్ధ విమానాల పర్యవేక్షణ పర్యటనలు 2020 మే నెలలో 35 జరిగితే, జూన్ నెలలో 49, జూలై నెలలో 67కు పెరిగాయి. ప్రతి రోజూ సగటున 3 నుండి 5 యుద్ధ విమానాలు చక్కర్లు కొడుతున్నాయి. చైనా కూడా, తన రక్షణ సన్నద్ధతను పెంచుకోవటానికి జూలై నెలలో సైనిక విన్యాసాలను సాగించింది. ఈ మోహరింపులు, యిరువురి మధ్య అనుకోకుండా ఘర్షణలకు దారితీసే ప్రమాదముందని సైనిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికా యుద్ధ నౌకలు, విమానాలు, చైనా రాజధాని బీజింగ్ నగరం మీద దాడి చేయగల్గినంత సమీపంలో ప్రయాణిస్తున్నాయని చెప్తున్నారు.
చైనా, దాని పొరుగు దేశాల మధ్య, దక్షిణ చైనా సముద్రంలో హక్కులపై కొన్ని వివాదాలు కొనసాగుతున్న మాట వాస్తవమే. వీటి పరిష్కారం కోసం ఈ దేశాల మధ్య సంప్రదింపులు జరుగుతున్నాయి. ఒక ఒప్పందానికి రావటానికి తీవ్ర ప్రయత్నాలు సాగుతున్నాయి. అమెరికా, వీరి మధ్య ఒప్పందం కుదరకుండా కుట్రలు, కుతంత్రాలకు పూనుకుంటున్నది. చైనాకు వ్యతిరేకంగా యితర దేశాలను రెచ్చగొట్టి, వేరు చేసే ప్రయత్నాలు చేసున్నది. ఈ ప్రాంత దేశాలన్నిటికి అమెరికా, యితర పశ్చిమ దేశాలు కొనసాగించిన దోపిడి, దురాక్రమణల సమిష్టి అనుభవాలు, వలస, నయావలస దోపిడి, ఆధిపత్య అనుభవాలు తలబొప్పి కట్టేంతగా వున్నాయి.
అమెరికాకు దోపిడి, దురాక్రమణ, ఆధిపత్యాల గత చరిత్రే కాకుండా, అత్యంత రక్తసిక్తమైన వర్తమాన చరిత్ర కూడా వుంది. రెండవ ప్రపంచ యుద్ధం పూర్తి కాగానే, జపాన్ చెప్పుల్లో కాళ్లు పెట్టి కొరియాపై యుద్ధాన్ని సాగించిన చరిత్ర దానిది. ఇటీవల కూడా దక్షిణ కొరియాతో కలిసి, ఉత్తర కొరియాను అదుపు చేసే పేరిట, అది జపాన్ సముద్రంలో సైనిక విన్యాసాలను సాగించింది. భారతదేశంతో కలిసి హిందూ మహా సముద్రంలో సైనిక విన్యాసాలు సాగించింది. వియత్నాం, లావోస్, కంబోడియాలలో సుదీర్ఘకాలం దురాక్రమణ యుద్ధాన్ని కొనసాగించి, లక్షలాది మందిని పొట్టన పెట్టుకున్న చరిత్ర దానిది. ఇండోనీషియాలో సుహార్తో సైనిక నియంతృత్వాన్ని యేర్పరచి లక్షలాది మంది కమ్యూనిస్టులను ఊచకోత కోయించిన చరిత్ర దానిది. పిలిప్పీలో, తన సైనిక బలగాలతో మార్కోస్ నియంతృత్వానికి రక్షణ కల్పించిన చీకటి చరిత్ర దానిది. పశ్చిమాసియానంతా రావణాసుర కాష్టం చేయటమేకాకుండా, ఇరాన్ మీద దుర్మార్గమైన ఆంక్షలు విధించి, వైమానిక దాడితో ఆ దేశ ముఖ్య నాయకుడిని హత్య చేసిన దేశం అమెరికా అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ చరిత్రను చైనా పొరుగు దేశాలేవీ మర్చిపోకూడదు. చైనా కూడా పూర్తి వెసులుబాటును ప్రదర్శించి, పొరుగు దేశాలతో సామరస్యాన్ని సాధించాలి. ఆధిపత్య ధోరణులకు యెట్టి పరిస్తితుల్లోనూ పూనుకోకూడదు.
అమెరికా-చైనా సంబంధాలు యింతగా దిగజారటానికి కారణాలేమిటి?
మూడు సంవత్సరాల క్రిందటి వరకు, అమెరికా - చైనాల మధ్య సాధారణ సంబంధాలే కొనసాగాయి. ఈ మూడు సంవత్సరాలలోనే, యివి, వేగంగా దిగజారాయి. 1978లో చైనా 'ద్వారాలు తెరవటం - సంస్కరణలు' అనే విధానాన్ని చేపట్టినప్పుడు, దానిని అమెరికా ఆహ్వానించింది. అంతర్జాతీయ సమాజంతో దౌత్య సంబంధాలకు చైనా షరతుగా పెట్టిన 'ఒకే చైనా - పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాలో తైవాన్ అంతర్భాగం' అనే విధానాన్ని అమెరికా అంగీకరించి, చైనాతో దౌత్య సంబంధాలను యేర్పరచుకుంది. చైనాలో పెద్ద యెత్తున పెట్టుబడులు పెట్టింది. చైనాతో వ్యాపారాన్ని భారీ యెత్తున పెంచుకుంది. చైనాను ప్రపంచ వాణిజ్య సంస్థలో చేర్చుకోవటానికి ఆమోదం తెలిపింది. జి.20 దేశాలలో చైనాను భాగస్వామి చేసింది. చైనా తన ప్రధాన వ్యాపార భాగస్వామిగా మారి అది ఆటంక పెట్టలేదు. చైనా, అమెరికా ప్రపంచాధిపత్యాన్ని రాజకీయంగా కాని, సైనికంగా కాని ఎక్కడా సవాలు చేసింది కూడా లేదు. దీనికి భిన్నంగా, రష్యా, ఉక్రెయిన్లో నాటో ఆధిపత్యాన్ని సైనికంగా అడ్డుకుంది. సిరియాలో ప్రత్యక్షంగా సైనిక జోక్యం చేసుకొని అమెరికాను ఆ ప్రాంతం నుండి వైదొలిగేలా చేసింది. పశ్చిమాసియాలో రష్యా, అమెరికా ఆధిపత్యాన్ని ప్రత్యక్షంగా సవాలు చేస్తున్నది. అయినా, అమెరికా, రష్యాను కాకుండా, చైనానే తన తక్షణ, ప్రత్యక్ష గురిగా చేసుకోవటం గమనారమైన విషయం .
ఈ సంవత్సరం నవంబరులో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి. ఇందులో తమ దేశ ప్రధాన ఆర్థిక, రాజకీయ ప్రత్యర్థి అయిన చైనాతో తాను దృఢంగా పోరాడుతున్నానని అమెరికా ప్రజలను నమ్మించటం, చైనా మీద దాడిని ట్రంప్ తీవ్రతరం చేయటానికి తక్షణ కారణం కావొచ్చు. ఇందుకోసమే, సైనిక్ సమీకరణతోసహా, యింత సర్వతో ముఖ దాడికి అమెరికా పూనుకుంటున్నదని నమ్మటం కష్టంగా వుంది.
చైనాతో ఘర్షణకు అమెరికా చెబుతున్న కారణాలు చైనా చెప్తున్న సమాధానం
చైనా, తనను దాటవేసి, ప్రపంచంలో నం.1 ఆర్ధిక శక్తిగా మారాలని చూస్తున్నదనీ. ప్రపంచాధిపత్యాన్ని తన చేతుల్లో నుండి గుంజుకోవాలని ప్రయత్నిస్తున్నదనీ, తన ప్రపంచాధిపత్యానికి సవాలుగా మారిందని అమెరికా బహిరంగంగానే విమర్శిస్తున్నది.
తాను, ఒక దేశం ప్రపంచంపై ఆధిపత్యం చెలాయించే విధానానికే వ్యతిరేకం అని చైనా చెప్తున్నది. కనుక, అమెరికాను ఆధిపత్యం స్థానం నుండి తొలగించి, ఆ స్థానాన్ని తాను చేపట్టాలనే వుద్దేశం తనకెంత మాత్రం లేదని చైనా జవాబిచ్చింది. తనకు ప్రపంచంలో ఎక్కడా సైనిక స్థావరాలు లేవని, తనకు విస్తరణ వాద వాంఛ లేదని అది చెప్తున్నది. 2. అమెరికా నాయకత్వంలో రూపొందించబడిన అంతర్జాతీయ ఆర్థిక విధానాల పరిధిలో, నియమ నిబంధనల పరిధిలో వ్యవహరించి మాత్రమే తాను ఆర్థికంగా రెండవ పెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపొందానని అది జవాబిస్తున్నది. గతంలో ఆధిపత్య శక్తులుగా యెదిగిన దేశాలలాగా తాను వలస వాదాన్ని కానీ, బానిస విధానాన్ని కాని అనుసరించ లేదని, యుద్ధాలకు పూనుకోలేదని అది జవాబిస్తున్నది. తన దేశ అభివృద్ధి, తన ప్రజల జీవన పరిస్థితుల మెరుగుదలే తన లక్ష్యాలని అది చెప్తున్నది. ప్రపంచ శాంతిని తాను కోరుతున్నానని, ప్రపంచ దేశాలన్నీ, ఉమ్మడిగా ఆమోదించిన అంతర్జాతీయ ఆర్థిక, న్యాయ సూత్రాలకు లోబడి వ్యవహరించాలని, పరస్పర లాభదాయకమైన సంబంధాలను కొనసాగించాలని కోరుతున్నానని అది చెప్తున్నది.
చైనా, తన టెక్నాలజీని దొంగతనం చేస్తున్నదని, కరెన్సీ మేనిప్యులేషన్ (తన కరెన్సీ విలువను కృత్రిమంగా తక్కువగా చూపించటం)కు పూనుకుంటున్నదని అమెరికా ఆరోపిస్తున్నది. ఇవి, ఆధారం లేని, అబద్దపు ఆరోపణలని చైనా కొట్టి వేస్తున్నది. టెక్నాలజీ రంగంలో వేగంగా కొత్త ఆవిష్కరణలు చేసుకుంటూ అమెరికాను అధిగమించి పోయే స్థితికి తమ సంస్థలు చేరుకోవటాన్ని అమెరికా జీర్ణించుకోలేక పోతున్నదని చైనా ఆరోపిస్తున్నది.
చైనా, ప్రపంచ దేశాలపై తన వ్యవస్థను, తన సిద్ధాంతాన్ని, విలువలను రుద్దటానికి పూనుకుంటున్నదని, ప్రపంచంలో ప్రజాస్వామ్యానికి, చైనా పెను ముప్పుగా మారిందని, దీనిని ఓడించటానికి ప్రపంచ దేశాలన్నీ చైనాకు వ్యతిరేక కూటమిగా యేర్పడాలని అమెరికా పిలుపునిచ్చింది.
తాను తన సిద్ధాంతాన్ని కాని, తమ రాజకీయ వ్యవస్థను కాని ఏ దేశం మీద రుద్దదలచుకోలేదని, సిద్ధాంతాలను, వ్యవస్థలనూ ఎగుమతి చేయటం తమ విధానం కాదని చైనా జవాబిచ్చింది. అదే సమయంలో, ఇతర దేశాలు, తమ దేశంలోకి వారి సిద్ధాంతాలను కానీ, వ్యవస్థలను కానీ ఎగుమతి చేయటానికి పూనుకుంటే, తాము సహించబోమని, అనుమతించబోమని చైనా జవాబిచ్చింది. ఒక చిన్న గ్రూపు ప్రయోజనాల కోసం పనిచేసే సిద్ధాంతాన్ని కానీ, వ్యవస్థలను కానీ తాము అంగీకరించబోమని, తమ దేశ ప్రయోజనాలను, తమ ప్రజలందరి శ్రేయస్సును ముందుకు తీసుకుపోయే సిద్ధాంతాన్ని, వ్యవస్థలను మాత్రమే తాము అంగీకరిస్తామని చైనా పేర్కొంది. ఈ విషయంలో తాము “మరొక అమెరికా” కాదలచుకోలేదని, తమ 'స్వాతంత్ర్యాన్ని” కోల్పోదలచుకోలేదని చైనా స్పష్టం చేసింది. ఒక దేశం మరో దేశపు ఆంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటానికి తాము వ్యతిరేకమని చైనా పేర్కొన్నది.
ప్రపంచంలో ప్రస్వామ్యానికి, స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలకు చైనా నుండి ముప్పు యేర్పడిందనే అమెరికా వాదన యెంత మాత్రం వాస్తవం కాదు. అందులో యెంత మాత్రం పస లేదు. పైగా, స్వాతంత్ర్యం, ప్రజాస్వామ్యాలకు అమెరికాయే పెను ముప్పుగా పరిణమించిందనేది కూడా నగ్న సత్యం. తన దోపిడీ, ఆధిపత్య విధానాలకు, తానే ప్రభోదించిన ప్రాపంచీకరణ విధానాలు ఆటంకాలుగా పరిణమించాయని భావించి, అమెరికా, నేడు, ప్రొటెక్షనిస్టు విధానాలకు పూనుకుంటున్నది. అంతర్జాతీయ సంస్థలన్నిటి నుండి అంతర్జాతీయ ఒప్పందాలన్నిటి నుండి బయటకు వస్తున్నది. ఈ విధానాలతో, చైనా లాంటి దేశాల పెరుగుదలను, తనకు పోటీగా మారే అవకాశాన్ని అరికట్టలేనని భావించి, అది, చైనాతో భౌతిక ఘర్షణకు సిద్ధమవుతున్నది. తన ఆర్థిక, రాజకీయ, సైనిక ఆధిక్యతను నిలబెట్టుకోవటానికి యెంత దూరమైనా వెళ్లటానికి అది సిద్ధమవుతున్నది. పర్యవసానమే అమెరికా, చైనాల మధ్య ప్రచ్చన్న యుద్ధ పరిస్థితి యేర్పడి తీవ్రతరం కావటం.
అయితే, కోవిద్-19 సంక్షోభం, దాని పర్యవసానంగా యేర్పడిన ఆర్థిక సంక్షోభం, చైనాతో సైనిక ఘర్షణకు అమెరికాకు అనేక పరిమితులను విధిస్తున్నాయి. అయినా, ఆధిపత్య శక్తులు అనాలోచితమైన తెగింపు చర్యలకు పూనుకోవని చెప్పలేము. ప్రపంచ దేశాలూ, ప్రజలూ, అమెరికా ప్రచ్ఛన్న యుద్ధ చర్యలకు వ్యతిరేకంగా, ప్రపంచ శాంతి పరిరక్షణ కోసం పోరాడాలి. ఆ విధంగానే మరో ప్రపంచ యుద్ధ ప్రమాదాన్ని, అణుయుద్ధ ప్రమాదాన్ని, మానవాళి వినాశనాన్ని నివారించుకోగల్గుతాం.