బి. ప్రదీప్
జైలు గోడలని చూపించి భయపెడతావేం
జులుం చెలాయించే మాటలనీ
మూఢత్వం ఆవరించిన రాత్రినీ
నేను ఒప్పుకోను, లోబడి లొంగిపోను
- హబీబ్ జాలిబ్
కవి వరవరరావు, 80 సంవత్సరాల వయసు, జైలు నిర్బంధంలో మగ్గుతున్నాడు. కవి, రచయితా, ఉద్యమ కారునిగా నాలుగు దశాబ్దాలకి పైబడిన వరవరరావు రాజకీయ జీవితంలో తప్పుడు కేసులూ, జైలు నిర్బంధమూ కొత్త కాదు, నిత్యం ఒక భాగంగానే వున్నాయి. ఇప్పుడు కూడా అలాంటి తప్పుడు, బూటకపు ఆరోపణలపైన్నే తనని నిర్బంధించారు. వయసు పైబడిన వరవర రావుని ఉపా చట్టం కింద, బీమా-కోరేగాం కేసులో ఇరికించి నిర్బంధించారు. ఈ కేసులో ఇంకొక పదిమంది ప్రజా కార్యకర్తల, న్యాయవాదులని కూడా ఇరికించారు. అనారోగ్యంతో బాధపడుతున్న వరవరరావు పదహారు నెలలు పూణేలోని యెరవాడ జైలులో పద్దెనిమిది నెలల నిర్బంధం తరవాత, ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో బొంబాయి తలోజా జైలుకి మార్చారు. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వరవరరావుకి సెయింట్ జార్, శేజే ప్రభుత్వ ఆసుపతులలో చికిత్స అందించామని చెప్పిన తర్వాత, కోవిడ్ వ్యాధి సంక్రమించింది. కుటుంబ సభ్యులు తనని జేజే ఆసుపత్రిలో చూసే సమయానికి ఆయన ఎలాటి సహాయమూ లేకుండా మంచంలో పడి వున్నారు. బటలు మూత్రంతో తడిసి వున్నాయి. చివరికి తనని నరాల మాది చికితకి నానావతి ఆసుపత్రికి తరలించారు. సుదీర నిర్బంధం తన ఆరోగ్యాన్ని, దేహాన్ని బాగా దెబ్బతీసింది. మనిషిని కుంగదీసింది. నిర్భీతిగా, నిక్కచ్చిగా సూటిగా, స్పష్టంగా మాట్లాడే మనిషిని అస్పష్టంగా, మాటలకై తడబడే దుస్థితిలోకి నెట్టింది. ఇజ్రాయిల్ పౌరురాలు, పాలస్తీనా కవి దరీన్ తతూర్ని, ఇజ్రాయిల్ ప్రభుత్వం నిర్బంధించింది. ప్రజలు ప్రతిఘటించాలని తన కవిత్వంలో పిలుపునిచ్చినందుకు తనకి జైలు శిక్ష వేశారు, టెర్రరిస్టులతో తనకి సంబంధాలున్నాయని ఆరోపించారు. “నేను నిర్బంధంలో వున్న కవిని. నేరారోపణ నన్ను ఆపాదమస్తకం కుంగిపోయేలా చేసింద”ని దరీన్ తతూర్ అంటుంది. వరవరరావు మీద కూడా, బీమా కోరేగావ్ కేసులో హింసకు ప్రేరేపించాడనే నేరాన్నే మోపారు.
హింసకు ప్రేరేపించి, రెచ్చగొట్టిన అసలు కుట్రదారులు స్వేచ్చగా, ఎలాంటి అడ్డంకులూ లేకుండా తిరుగాడుతుంటే, ఆ హింసా ఘటనలతో ఎలాంటి ప్రమేయమూ లేని వ్యక్తులని నిరంకుశ ఉపా చట్టంకింద నిర్బంధించిన ఉదంతాలకి బీమా కోరేగావ్ కేసు మరొక ప్రత్యక్ష ఉదాహరణ. 2018 జనవరి 1 న జరిగిన ఘటనలకు బాధ్యులుగా ఉపా చట్టం కింద వరవరరావుతో సహా పదకొండు మందిని నిర్బంధించారు. పూణే నగరానికి 40 కిలోమీటర్ల దూరంలో వున్న బీమా కోరేగావ్ వద్ద జరిగిన యుద్ధానికి, ద్విశతాబ్ది ఉత్సవాలను నిర్వహిస్తున్న వారిపై కాషాయ మూక దాడికి పాల్పడింది. ఈ హింసా దాడికి మూడు రోజుల ముందు, సమీప గ్రామంలో దళిత సైనికుడు గోవింద్ గోపాల్ మెహర్ సమాధిని కూడా వాళ్ళే ధ్వంసం చేశారు. అయినా డిసెంబరు 31న ఎల్గార్ పరిషద్ నిర్వహించిన సభలో ఉపన్యాసాలే హింసను ప్రేరేపించాయని పోలీసులు ఆరోపిస్తున్నారు. హేనీ బాబుతో సహా ముద్దాయిలుగా పేర్కొన్న మిగతా పదకొండు మంది గానీ, ఎవ్వరూ ఎల్గార్ పరిషద్ సభలో ప్రత్యక్షంగా పాల్గొన్నవాళ్ళు కాదు. వరవరరావు కూడా ఆ సభలో లేరు. అయినా, పూణే పోలీసులు, ఎన్‌ఏ తప్పుడు కేసును బనాయించారు. ఉపా చట్టాన్ని మోపారు. ఉపా నిరంకుశ చట్టం అన్ని సహజ న్యాయ సూత్రాలనీ కాలరాస్తుంది. నిర్దిష్టమైన నేరారోపణలు, విచారణ జరపకుండా జాప్యం చేస్తూ బెయిల్ విజ్ఞప్తులని పదే, పదే తిరస్కరించారు. మహారాష్ట్రలో బిజేపీ అధికారాన్ని కోల్పోవడంతో, కేసుని మహారాష్ట్ర పోలీసుల నుంచి తప్పించి కేంద్ర సంస్థ ఎఏకి అప్పగించారు. వైరస్, వరవరావు వృద్ధాప్య స్థితిని చూపించి ప్రయోజనం పొందజూస్తున్నారని ఎన్‌ఏ వాదించడం దాని అమానవీయతకి పరాకాష్టగా నిలుస్తుంది. ఉపా చట్టం వ్యక్తులనే, సంస్థలనే నేరస్తులుగా ముద్రవేస్తుంది. నేరాన్ని ఆరోపించిన వాళ్ళు ఆ నేరాన్ని రుజువు చేయాల్సిన బాధ్యత వహించాల్సిన సహజ న్యాయ సూత్రాలకి విరుద్ధంగా, నిందితులే తమ నిర్దోషిత్వాన్ని రుజువు చేసుకోవాల్సిన స్థితికి నెడుతుంది. వరవరరావు విచారణలో వున్నా ఒక ఖైదీ. శిక్ష పడలేదు, నేరారోపణకి రుజువులు లేవు, నిర్దిష్టమైన విచారణా లేదు, అయినా ఆయన ఇప్పటికే ఇరవై నెలలుగా జైలులో మగ్గుతున్నాడు.
నిర్బంధంలో ఉండగా, 90 శాతం అంగ వైకల్యంతో వున్న ప్రొఫెసర్ రందంలో ఉండగా 90 శాతం సాయిబాబా శిక్ష పడిన ఖైదీగా నాగపూర్ జైలులో కొనసాగుతున్నాడు. నిషేధిత మావోయిసు పార్టీతో సంబంధాలు కలిగివున్నాడనే ఆరోపణ మీద ఒక మహారాష్ట్ర కోరు సాయిబాబాకి జీవిత ఖైదు శిక్ష విధించింది. 2014లో అరెసయిన సాయిబాబా బెయిల్ పై బయటికి వచ్చిన తర్వాత మళ్ళీ నిర్బంధంలోకి తీసుకున్నారు. 2017 నుంచి నాగపూర్ జైలులో ఒంటరి నిర్బంధ శిక్షని అనుభవిస్తూ వున్నాడు.
'ఎక్కడ చనిపోతుందో తెలియని ఈగ లాగా నేను నా సెల్ లో తిరుగుతూ వున్నాన'ని జైలులో వున్న ఇటాలియన్ కమ్యూనిస్టు గ్రాంసీ సురాం అంటాడు. అండా సెల్‌లో సాయిబాబా అలాంటి సితిలోనే మరి పోతున్నాడు. అయితే, సాయిబాబా తన శారీరక వైకల్యం మూలంగా అలా తిరగను కూడా తిరగలేడు. కనీస వసతులు, వైద్య సదుపాయాలు సైతం లేకుండా చీకటి కొట్లో మగ్గే మనిషి అవస్థలకు సాయిబాబా పరిస్థితి ఒక ఉదాహరణ. తన దైనందిన కార్యక్రమాలని కూడా తనకుతానుగా చేసుకోలేని స్థితిలో ఎలాంటి సహాయమూ లేని అనారోగ్యకరమైన వాతావరణంలో సాయిబాబా నిర్బంధ శిక్షని అనుభవిస్తున్నాడు. గత జూలై నెలలో సాయిబాబా తన న్యాయవాదితో ఫోన్ లో మాట్లాడి తన పరిస్థితిని వివరించాడు. తన చుట్టూ కరోనా వ్యాధి వ్యాపిస్తూ ఉందనీ, తనకి కూడా వ్యాధి సోకే ప్రమాదం పొంచివుందనీ తెలియజేశాడు. పట్టించుకునేదెవరు? నిస్సహాయమైన తన ఆక్రందన కోర్టులకి వినపడుతుందా? మృత్యుశయ్యపై వున్న తన తల్లిని కడసారి చూసే అవకాశం కోసం బెయిల్ ఇవ్వాలని అభ్యర్థిస్తూ సాయిబాబా నాగపూర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసాడు. సాయిబాబా తల్లి కంటెయిన్మెంట్ జోన్లో ఉందనీ, బెయిల్ పై తనని విడుదల చేస్తే, కరోనా వ్యాధి సోకే అవకాశం ఉందని కోర్టులో ప్రభుత్వం పచ్చి అబద్దమాడింది. కోర్టు ఆ మాటలని అంగీకరించి సాయిబాబాకి బెయిల్ నిరాకరించింది. తన తల్లిని కడసారి చూసుకునే హక్కుని నిరాకరించింది. ఆ తల్లి చివరికి తన కొడుకుని చివరిసారి చూసుకోకుండానే చనిపోయింది. జైలు సిబ్బందికీ, ఖైదీలకీ కరోనా వ్యాధి సోకుతున్న వాతావరణంలో, మరణశయ్యపై వున్న తన తల్లిని చూసుకోవడంకంటే, జైలులో ఉండడమే సాయిబాబాకి శ్రేయస్కరం అన్న దుర్మార్గమైన ప్రభుత్వ వాదనని కోర్టు అంగీకరించింది. తనకి కనీసం తాత్కాలికమైన ఊరట కలిగించమని వేడుకుంటున్న సాయిబాబా విజ్ఞప్తులని కూడా కోర్టు వినిపించుకో లేదు.
ధిక్కార స్వరాలు, నిరసన గళాలు జైళ్లలోనే మగ్గిపోవాలి. కాషాయ మూకల న్యాయ సూత్రమిదే. కోర్టులు కూడా ఇదే న్యాయమంటున్నాయి. కాషాయ మూక దేశంలోని అన్ని పాలనా వ్యవస్థల పైనా పట్టు సంపాదించింది. న్యాయవ్యవస్థ ఇందుకు మినహాయింపుగాలేదని రుజువవుతూవుంది. ఇవి చీకటి రోజులు. ఈ చీకటి రోజులని ప్రశ్నించి, ఎదిరించి, వీటి గురించి గొంతెత్తి మాట్లాడేవాళ్ళు ఇప్పుడు బాధితులు. ఈ చీకటి శాశ్వతం కాదు, దీన్ని పారద్రోలాల్సిందే!