భద్రాద్రి జిల్లాలో పోడు భూముల రక్షణకై పోరాటం

 భద్రాద్రి జిల్లాలొ పొడు భూముల సమస్య తీవ్రంగావున్నది. హరితహారం 6వ విడత కార్యక్రమంలో భాగంగా 2020 మార్చి, ఏప్రిల్, మే నెల నుండే అందుకు ముందస్తు చర్యలను టీఆర్ఎస్ ప్రభుత్వం అటవీ శాఖ అధికార్ల ద్వారా మొదలు పెట్టింది. జిల్లాలో వారు ఎక్కడైతే మొక్కలు నాటదలిచారో ఆ ప్రాంతాలను గుర్తించి, అక్కడ పోడు సాగు చేసుకొంటున్న ఆదివాసీ, గిరిజన, ఇతర పేదలను బెదిరించటం, కందకాలు తీయటం వంటివి చేపట్టారు. తొలకరి ప్రారంభం కావటంతో రైతులను పంటలు వేయవద్దని సాగును అడ్డగించుట, ట్రాక్టర్లను పట్టుకొని కేసులు పెట్టటం వంటి చర్యలు చేపట్టారు. నువ్వు, తదితర పంటలు వేశారు. ఈ పంటలను కొన్ని చోట్ల అటవీ అధికారులు ట్రాక్టర్లతో ధ్వంసం చేసి, మొక్కలు నాటారు. ఈ క్రమంలో కందకాలు తవ్వే నుండి చాలా చోట్ల ఆదివాసులు ప్రతిఘటించారు. నిర్మాణ బలం వున్న దగ్గర ప్రతిఘటించి రక్షించుకున్నారు. బలహీనమైన చోట్ల అటవీ అధికారులు హరిత మొక్కలు వేసుకోగలిగారు. ఒక వేళ అధికారులు బలవంతంగా వేసినా, ఆదివాసులు మొక్కలు పీకివేసి తిరిగి పంటలు వెసుకొన్నారు. ఈ క్రమంలో పొలిసు కేసులు నమోదు చేశారు. కొందరు జైలుపాలైనారు. అయినా జనం దృఢంగా నిలబడ్డారు. అంతేకాదు, అటవీ అధికారులు పోలీసులు ప్రజలను నీరుగార్చటానికి చేస్తున్న ప్రయత్నాలకి ప్రజలు సమాధానం చెప్పటం వారి చైతన్యానికి నిదర్శనం. భద్రాద్రి జిల్లాలోని కొన్ని మండలాల్లో జరిగిన ప్రతిఘటనా పోరాటాలు.


1) దమ్మపేట మండలం మొండివ - గుండుగలపల్లి సమీపంలో సుమారు 1000 ఎకరాలలో 6 గ్రామాల ప్రజలు 2000 సం||రానికి ముందు నుండే పోడు నరికి 400 ఆదివాసీ కుటుంబాలు సాగు చేసుకొని జీవిస్తున్నాయి. జీడి మొక్కలు వేసుకొన్నారు. పత్తి, కంది, మొక్కజొన్న, తదితర పంటలు పండించుకొంటున్నారు. ఈ భూమికి పట్టాలివ్వమని తహశీలార్కి, ఐటీడీఏ పీఓకు పలుమార్లు దరఖాస్తులు అందజేశారు. కానీ, పట్టాలివ్వటానికి ముందుకు రాని ప్రభుత్వం, ఈ సం॥రం జూన్ 16న కొందరు రైతులు జీడి మొక్కలు వేసుకొనుచుండగా అటవీ అధికారులు అడ్డుపడ్డారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. అటవీ అధికారులు ఆదివాసీలపై స్థానిక పోలీసు స్టేషన్లో కేసు పెట్టారు. జూన్ 18, 19 తేదీలలో పోడు భూమిలో పని చేసుకొంటున్న రైతులను పోలీసులు, అటవీ అధికారులు వచ్చి మొత్తం భూమిలో 50 ఎకరాలు విడిచి పెట్టాలని లేక పోతే కేసులు పెడతామని బెదిరించారు. ఆ తరువాత చాలా సార్లు గ్రామాల ముఖ్యులను, న్యూడెమోక్రసీ నాయకులను స్టేషన్‌కు పిలిపించి బెదిరించారు. 50 ఎకరాలు వదలాలని, లేకపోతే కేసులు పెడతామని మరోసారి హెచ్చరించారు. బెదిరింపుల కొనసాగింపుగానే 5.7.2020న అశ్వారావుపేట సి.ఐ. మండల కార్యదర్శి అప్పారావు, మరో 10 మందిని రాత్రి 10 గంటల వరకు వుంచుకొని బెదిరించారు. అయినా ధైర్యంగా, పోడు భూమిని వదలము అని చెప్పారు. అయితే ఏదో లాగా మొక్కలు వేసి తీరాలనే మొండి పట్టుదలగల అటవీ అధికారులు 6.7.2020న తెల్లవారు జామున ఏఐకేఎంఎస్ మండల కార్యదర్శి అప్పారావు, మరో 10 మంది ముఖ్యులను అరెస్టు చేసి స్టేషన్లో పెట్టారు. హరిత మొక్కలు నాటుటకు ఉదయం ఎవరుండరని భావించారు. అయినా అటవీ అధికార్లు, పోలీసులు గండుగుల పల్లి, మొండివర్రె కాలనీ, దురదపాడు, ముత్తాయిగూడెం, జారెగుంపు, తదితర గ్రామాలను దిగ్భందించి మొక్కలు వేయుటకు ట్రాక్టరుతో దున్నటం ప్రారంభించారు. ముందుగా మొండివ, గ్రామస్తులు అడ్డుకొన్నారు. వీరిని అరెస్టు చేశారు. అయినా తెలిసిన వారు తెలిసినట్లుగా 500 మంది ఆదివాసులు పోడులోకి వచ్చి అటవి అధికార్ల పనులను అడ్డగించారు. దీనితో సాయంత్రం 2 గంటల వరకు ఆదివాసీలు అధికార్లతో గొడవ పడ్డారు. ఒక్క అడుగు ముందుకు సాగనివ్వలేదు. దీనితో పోలీసులు, అటవీ అధికార్లు వెనుదిరగవలసి వచ్చింది. సాయంత్రం ముఖ్యులను స్టేషన్‌కు రమ్మన్నారు. ఓటమిని మింగలక పోలీసులు నాయకులను బెదిరించారు. అయినా ఆదివాసిలది ఎలా న్యాయమో, వారికి వున్న గత కేసుల ఆధారాలు, పిటిషన్లు చూపించి ఎదిరించుట జరిగింది. ఈ సందర్భంగా 41 మంది పై నాన్ బెయిల్ బుల్ కేసులు పెట్టి జైలుకు పంపారు. ఇందులో న్యూడెమోక్రసీ మండల కార్యదర్శి ఎ. రాముపై కేసు పట్టారు. ధైర్యంగా ప్రతిఘటించిన ఆదివాసులకు మద్దతుగా, అదే రోజు మరియు 13.7.2020న న్యూడెమోసీ రాష్ట్ర బృందం పర్యటించి ధైర్యం చెప్పింది. బృందంలో పీఆర్, కేఆర్, జీవీఆర్, ఎంబీ, తదితర నాయకులున్నారు. ఈ


2) దుమ్ముగూడెం మండలం - దుమ్ముగూడెం మండలం గౌరారం ఆదివాసీలు 2000కి ముందు నుండే 130 కుటుంబాలు గ్రామానికి ప్రక్కనే గల 500 ఎకరాల అడివిని శుభ్రం చేసి పంటలు పండించు కొంటున్నారు. వీరంతా పేదలే. పోడు సాగును నిరోదించుటకు అటవీ అధికారులు అడవి ధ్వంసం చేశారని 2007లో 10 మందిపై కేసు పెట్టారు. తరువాత కేసు కొట్టివేశారు. అప్పటి నుండి ఆదివాసీలు పోడును అనుభవిస్తూనే వున్నారు. టీఆర్ఎస్ రెండుసార్లు గెలిచిన సందర్భంగా పట్టాలు వస్తాయని ఆదివాసీలు ఆశించారు. కేసీఆర్ ప్రకటనలను నమ్మారు. తమ గ్రామంలో కూడా టీఆర్ఎస్ ప్రెసిడెంట్‌నే గెలిపించుకొన్నారు. 2020 తొలకరిలో రాస ప్రభుత్వం చేపట్టిన 6వలని విడత హరితహారంలో భాగంగా మొక్కలు వేయుటకు అటవీ అధికార్లు ప్రయత్నాలు మొదలు పెట్టారు. మరో ప్రక్క కొందరిని వీడదీని మెత్తబర్చటానికి, 100 ఎకరాల వరకు, 30 కుటుంబాలకిస్తామని సర్వే నాటకం ఆడారు. కానీ, పట్టాలివ్వ లేదు. ఇంతకు ముందు కూడా ఇదే ప్లాలో 9 మందికి 15 ఎకరాలు హక్కు పత్రాలిచ్చారు. మిగిలిన పోడు భూమిలో 2020 జూన్ 2న హరితహారం, మొక్కలు వేయుటకు అటవీ అధికార్లు పెద్దఎత్తున పూనుకొన్నారు. ఆదివాసీలకు - అటవీ అధికారులకు వాదోపవాదాలు జరిగాయి. డీఎఫ్ఓ సమక్షంలోనే వేసిన మొక్కలు పీకివేసి నిరసన తెలిపారు. అటవీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరునాడు అనగా 3.6.2020న దుమ్మగూడెం స్టేషన్లో గ్రామసులంతా కలవాలని సి.ఐ. కబురు పెటాడు. సుమారు 100 మంది హాజరు కాగా, పోలీసులు తమ ధోరణిలో బెదిరించారు. హరితహారం కోసం మా బ్రతుకుదెరువు పోగొట్టుకోలేమని ఆదివాసీలు Tags ముక్తకంఠంతో చెప్పారు. 60 మందిపై కేసు నమోదు చేశారు. అయినా, పోడు భూములపై పటుదలగల ఆదివాసీలు మ్యాడెమోక్రసీ, అలిల భారత రైతు కూలీ సంఘం (ఏఐకేఎంఎస్) ఆధ్వర్యంలో తహశీల్దార్, డీఎఫ్ఓ, ఐటీడీఏ పీఓలకు మెమోరాండాలు అందజేసి, తమ భూములకు కు హక్కులు కల్పించమని లాక్ డౌన్ కాలంలో కూడా నిరసనలు తెలిపి మెమోరాండాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో 40-70 మంది వరకు పాల్గొన్నారు. ఈ పోరాటంలో స్త్రీలు ముందు భాగంలో వున్నారు.


ఈ పోడు భూమిలో ఎలాగైనా హరిత మొక్కలు వేయాలనే పట్టుదలతో వున్న అటవీ అధికారులు 100 మంది ఆదివాసీలు 27.7.2020న వేసిన మొక్కలను తొలగించారు. అప్పటికే తాము వేసుకొన్న, బ్రతికి వున్న పంటలను రక్షించుకొనే ప్రయత్నంలో వున్నారు. మళ్లీ కేసు పెడతామని బెదిరిస్తున్నారు. ఇలా జరుగుతున్న క్రమంలో క్రమంలో న్యూడెమోసీ జిల్లా ప్రతినిధి బృందం 24.7.2020న గౌరారం గ్రామం పర్యటించింది. పోడు రక్షణకు సమైక్యంగా పోరాడమని చెప్పింది. పర్యటన బృందంలో ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, న్యూడెమీసీ రాష్ట్ర నాయకులు కెచ్చెల రంగా రెడ్డి, జిల్లా నాయకులు ముద్దా బిక్షం, కె. కల్పన, డివిజన్ నాయకులు సాయన్న, తదితరులున్నారు.


3) నారాయణరావుపేట పోడు పోరాటం - దుమ్ముగూడెం మండలం నారాయణరావు పేట ఆదివాసీలు 2000 సం॥రంలో 50 కుటుంబాలు, 150 ఎకరాల పోడు నరుక్కుని సాగుచేస్తుండగా, 2007లో 10 మందిపై అటవీ అధికారులు కేసు పెట్టారు. జైలుకు వెళ్ళి వచ్చారు. పోడును మాత్రం వీడలేదు. 2020లో హరిత మొక్కలు వేయుటకు, అటవీ అధికారులు ఎండా కాలంలోనే అది. అటవీ అధికారులు ఎండా కాలంలోనే ఆదివాసీలను బెదిరించుట మొదలు పెట్టారు. కందకాల తవ్వకం చేశారు. ఆ సందర్భంగా ఆదివాసీలు నిరసనలు తెలిపారు. అయినా ఆగలేదు. తొలకరి ప్రారంంభం కాగానే అటవీ అధికార్లు 18.6.2020న పత్తి పంటలు ధ్వంసం చేసి, హరిత మొక్కలు వేశారు. ఆదివాసీలు ఆ మొక్కలను తొలగించి తిరిగి పంటలు వేశారు. ఈ విషయమై అటవీ అధికారులు పోలీసు కేసు పెట్టి, పోడులో లు పోలీసు కేసు పెట్టి పోడులో పని చేసుకొంటున్న ఆదివాసీలను అరెస్టు చేయుటకు వెళ్ళగా ప్రతిఘటించారు. బలవంతంగా అరెస్టు చేశారు. 21 మందిపై కేసు పెట్టారు. అటవీ అధికారులు జులై మొదటి వారంలో మళ్లీ మొక్కలు వేశారు. కాగా, బ్రతికున్న పంటలను కాపాడుకొనుటకు అటవీ శాఖపై పోరాడాలని ఆదివాసీలు సమాయతమవుతున్నారు.


చిన్న ఆర్లగూడెం పోడు రక్షణ పోరాటం - దుమ్ముగూడెం మండలం చిన్న ఆర్లగూడెం, పెద్ద ఆర్లగూడెం, సింగారం ఆదివాసీ గ్రామాల మద్యగల అటవీ భూమిని 200 మంది. 300 ఎకరాలు పోడు గొట్టి 2000 సం||రం నుండి సాగు చేసుకొంటున్నారు. ఈ పోడుపై 2002-2003లో, 2007, 2013లో కేసులు అయినాయి. అయినా వదలకుండా ఆదివాసీలు సాగు చేస్తూనే వున్నారు. పటాలు ఇవ్వాలని నూరు దరఖాస్తులు కూడా చేసుకొన్నారు. కానీ, చితశుది 6వలని ప్రభుత్వాలు దరఖాస్తులను పక్కన పెట్టాయి. అయితే 2020 సం॥రంలో 6వ హరితహారం కోసం ఈ 300 ఎకరాలనే అటవీ అధికారులు నిర్ణయించుకొన్నారు. సాగు మానమని బెదిరించుట మొదలు పెట్టారు. లాక్ డౌన్ కాలంలో కందకాలు తీయించారు. ఈ సందర్భంగా ఆదివాసీలు ప్రతిఘటించారు. కందకాలు పూడ్చి వేసి నిరసన తెలిపారు. అటవీ అధికార్లు ఆదివాసీల్లో తెచ్చే ప్రయత్నాల చేశారు. 17 మందికి సంబంధించిన భూమి, 50 ఎకరాలలో మొక్కలు వేయుటకు ప్లాన్ చేసుకొన్నారు. 2 ఎకరాలలోని పత్తి పంట ధ్వంసం చేశారు. మిగతా వారికి పట్టాలిస్తామని నమ్మ బలుకుతున్నారు. దీనితో 'మా భూములు పోవటం లేదుగదా మేమెందుకు పోరాడాలనే” భావన వచ్చింది. అయినా, భూములు కోల్పోతున్న 17 మంది మాత్రమే అటవీ అధికారుల దుశ్చర్యలకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. అటవీ అధికార్లు వేసిన హరిత మొక్కలు తొలగించే పం హరిత మొక్కలు తొలగించే పంటలు కాపాడుకోవాలని ఆరాటపడు తున్నారు. వీరి తున్నారు. వీరి పోరాటానికి అందరిని సమైక్య పర్చే కృషి జరుగుతున్నది.


ఎపీలో కలిపిన ఎటపాక (భద్రాచలం), కూనవరం మండలాల్లో పోడు భూమి సమస్య - రామచంద్రుని పలు అనే ఆదివాసి గ్రామం దుమ్ముగూడెం మండలంలో వున్నప్పటికీ, వారు సాగు చేసే పోడు భూమిలో కొంత అనగా 200 కరాలు పోలవరం ప్రాజెక్టు కోసం ముంపు మండలంగా కలిపిన ఎటపాక (భద్రాచలం) మండలంలోకి పోయింది. ఈ 200 ఎకరాల పోడు భూమిని, వలస వచ్చి ఆక్రమించారని అటవీ శాఖ ఆరోపిస్తూ దౌర్జన్యంగా స్వాధీనం చేసుకోవాలని, గత 3 సం||రాలుగా ప్రయత్నిస్తున్నది. అయినా ప్రతిఘటించి రక్షించుకొంటూ వస్తున్నారు. నిర్బంధాన్ని సైతం ఎదుర్కొన్నారు. 2020 సం||రం జులై 9న మరోసారి రేంజర్, ఒక నోటీసు పంపాడు. దీనికి గ్రామస్తులు సమాధానం పంపారు. ఐటీడీఏ, పీఓ చింతూరు వారిని కూడా రిప్రజెంట్ చేశారు. ఈ భూమిలో పత్తి, కంది, నువ్వు, వరి తదితర పంటు వేశారు.


ఈ పోడు భూమి వాస్తవానికి తాతల నాటిదే. దీనికి 1996లో అటవీ అధికారులు మోసిగించి వీఎస్ఎన్ ప్రారంభించారు. అది విఫలమైనది. దీనితో ఎవరి భూములు వారు తిరిగి పంటలు వేసుకోసాగారు. 2008లో ఉమ్మడి పట్టాలిచ్చారు. 2013లో షెడ్యూల్డ్ ప్రాంతంలో వి.ఎస్.ఎస్. చెల్లదని కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ రద్దు చేసింది. ఇంత వరకు ఎమి అనని అటవీ అధికారులు 2017 నుండి ఆ భూమిని కాజేయుటకు, మొక్కలు వేయుటకు, దాడులు, బెదిరింపులు, నిర్బందానికి పూనుకోగా న్యూడెమోక్రసీ నాయకత్వంలో తిప్పికొట్టి పంటలు కాపాడుకొంటున్నారు. 2020లో పట్టాలిచ్చేలా కృషి జరుగుతోంది. ఇది ప్రతిఘటనలో దృఢంగా నిలబడిన ఫలితమే. కూనవరం మండలం దూగుట్ట ఆదివాసీ గ్రామంలో అనేక సం||రాలుగా ఆదివాసీలు సాగు చేసుకొంటున్న 50 కుటుంబాలు 100 ఎకరాలలోని ఆదివాసీలను గెంటి వేయుటకు గత 2 సం||రాలుగా అటవీ అధికారులు ప్రయత్నిస్తుండగా ప్రతిఘటించి రక్షించుకొంటున్నారు. ఈ సం||రం 2020లో కూడా మరోసారి గ్రామానికి వచ్చి బెదిరించగా ఆదివానీలు ఎదురుతిరిగారు. “భూములు విడిచి పెట్టము” అని తేల్చి చెప్పారు. దానితో ఆగస్టు 9న పట్టాలిస్తామని చింతూరు పీఓ గ్రామానికి వచ్చి ప్రకటించారు.


ములకలపల్లి మండలం- ములకలపల్లి మండలం మూకమామిడి సమీపంలోని అడవిని 100 మంది ఆదివాసీలు, కొందరు ఇతర పేదలు 150 ఎకరాల వరకు సాగు చేసి పంటలు వేసుకొంటున్నారు. అయితే, ఇది కొత్త పోడు అని చెప్పి, అటవీ అధికారులు గత సం||రం, రైతుల పత్తి పంట పాడు చేసి పోలీసుల సహకారంతో హరిత మొక్కలు నాటారు. వీటిని ప్రజలు పీకివేసి కొంత మేరకు పంటలు వేసుకొన్నారు. ఈ సం॥రం 2020లో కూడా మొక్కలు వేయుటలో భాగంగా అటవి అధికారులు ప్రయత్నిస్తుండగా, ముఖ్యంగా మొక్కల కోసం కర్రలు పాతగా, వాటిని తొలగించి నిరసన తెలిపారు. అయినా అర్థం చేసుకోలేని అధికారులు మొక్కలు కూడా వేశారు. ఇట్టి చర్యలను ఎదిరించి పంటలు వేసుకొనుటకు, ఆదివాసీలు, ఇతర పేదలు సమాయత్తముతున్నారు.