రైలు మార్గాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమించండి-ఇప్పు జాతీయ కమిటీ పిలుపు అమలు

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ నిస్సిగ్గుగా 109 రైలు మార్గాల ప్రైవేటీకరణ పూనుకుంది. భారత రైల్వే వ్యవస్థకు నూట అరవై సంవత్సరాల చరిత్ర ఉంది. సాధారణ ప్రజలకు అతి తక్కువ ధరలతో, మంచి ప్రయాణాన్ని కల్పించే రైల్వేలైను, ప్రైవేటు వాళ్ళకి అప్పగించడం పెను ప్రమాదంగా మారనుంది. భారత రైల్వేలో లక్షలాది మంది కార్మికవర్గం పనిచేసి కోట్ల సంపద కూడ పెట్టారు. ఈ


కరోనా సంక్షోభ కాలంలో పాలకవర్గాలు కరోనా ని ఎలా ఎదుర్కోవాలనే విషయం కాకుండా లాభాలు వచ్చే సంస్థలను ప్రైవేట్ వాళ్లకు ఎలా కట్టబెట్టాలి, విదేశీ పెట్టుబడులను ఎలా ఆహ్వానించాలీ అని ఆలోచిస్తున్నది. 130 కోట్ల భారతీయులు భయం గుప్పిట్లో జీవిస్తున్న కాలంలో, వారికి అండ ఇవ్వాల్సింది పోయి నేడు కార్పొరేట్ కంపెనీలకు ఎలా సేవ చేయాలని పాలకవర్గాలు ఆలోచిస్తున్నాయి. అందులో భాగం గానే విదేశీ పెట్టుబడులను 100% ఆహ్వానించడానికి, 109 రైలు మార్గాలను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడానికి పచ్చజెండా ఊపారు. భారత కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న అనేక కార్మిక హక్కులను హరించడానికి, ఆర్డినెన్స్ రూపంలో వాటిని కట్టడి చేయడానికి వునుకున్నారు. వీటిని వ్యతిరేకిస్తూ భారత కార్మిక సంఘాల సమైక్య జాతీయ కమిటీ జూలై 24న దేశవ్యాపితంగా రైలు మార్గాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన తెలియజేయాలని పిలుపునిచ్చారు. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో 23 రైల్వే స్టేషన్ల పరిధిలో ఐ.ఎఫ్.టి.యు శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు.


ఖమ్మం రైల్వే స్టేషన్ వద్ద నిరసన చేయడానికి అనుమతి ఇవ్వకపోవడంతో చండ్రపుల్లారెడ్డి భవన్ దగ్గర నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐఎటియు రాష్ట్ర సహాయ కార్యదర్శి జి. రామయ్య, జిల్లా ఐఎఫ్ టియు నాయకులు అశోక్, రామారావు, కే శ్రీనివాస్, రంగయ్య, నాగేశ్వరరావు, పీ వెంకన్న, పటేల్ తదితరులు పాల్గొన్నారు.


మధిర: రైల్ రూట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఐఎటీయు జిల్లా అధ్యక్షులు వెంకన్న నాయకత్వాన ఐఎయు నేతలు డి. శ్రీనివాస్, కే. పుల్లారావు, వై బాబు, జి.నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


ఖమ్మం రూరల్: ఎం. వెంకటాయపాలెం దగ్గర నిరసన తెలిపారు. పుల్లయ్య, లెనిన్ తదితరులు పాల్గొన్నారు.


కొత్తగూడెం:- కొత్తగూడెం రైల్వే స్టేషన్ ముందు నిరసన వ్యక్తం చేశారు. సంజీవ్ సతీష్ శ్రీనివాస్ నాయకత్వం వహించారు.


మణుగూరు:- రైల్వే స్టేషన్ ముందు ఇప్పు నాయకత్వాన నిరసన వ్యక్తం చేశారు. మధుసూదన్ రెడ్డి, ఎండీ గౌస్, రాజు సమ్మయ్య, చారి, శ్రీరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


నిర్మల్ జిల్లా:- నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు రైళ్ల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఐ.ఎఫ్.టి.యు రాష్ట్ర సహాయ కార్యదర్శి కే. రాజన్న, జిల్లా నాయకులు బక్కన్న, రామ లక్ష్మణ్, గఫూర్, గంగన్న, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.


గద్వాల:- గద్వాల రైల్వే స్టేషన్ ముందు నిరసన వ్యక్తం చేయడానికి పూనుకోగా, పోలీసులు కార్యకర్తలను అరెస్ట్ చేయడానికి సిద్ధమయ్యారు. వారి నుంచి తప్పించుకొని నిరసన వ్యక్తం చేసి స్టేషన్ మాస్టర్ శివరాం ప్రసాదు వినతి పత్రం ఇచ్చారు. పోలీసులు అరెస్ట్ చేసి సొంత పూచీకత్తుపై వదిలి పెట్టారు.


జగిత్యాల:- కోరుట్ల రైల్వేస్టేషన్ లో నేతలు నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి ఐఎటీయూ రాష్ట్ర నాయకులు సిహెచ్ భూమేశ్వర్, భీమయ్య, యం. గంగాధర్, పోషల్ తదితరులు పాల్గొన్నారు.


నిజామాబాద్:- జిల్లా రైల్వే స్టేషన్ ముందు నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మురళి, ఎల్.బి. రవి, శివకుమార్లు పాల్గొన్నారు.


ఆర్మూర్:- రైల్వే స్టేషన్ ముందు ఐఎసీయు జిల్లా జిల్లా కార్యదర్శి దాసు, రాష్ట్ర కమిటీ సభ్యులు ముత్తన్న, జిల్లా నాయకులు శివాజీ, సుంకరి శ్రీనివాస్, లక్ష్మీనారాయణ, కృష్ణంరాజు పాల్గొన్నారు. స్టేషన్ ముందు ఐఎఫ్ టియు జిల్లా నాయకులు మల్లేష్ నాయకత్వాన నిరసన కార్యక్రమం చేశారు.


అదిలాబాద్:- జిల్లా కేంద్రంలో రైల్వే స్టేషన్ ముందు వెంకట్ నారాయణ నాయకత్వాన నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు జగన్, మహేష్, విజయ్, సుభాష్ పాల్గొన్నారు.


మహబూబ్ గర్:- జిల్లా రైల్వే స్టేషన్ ముందు ఐఎఫ్ సి రాష్ట్ర కోశాధికారి శ్రీ వెంకటేష్ నాయకత్వాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సాంబశివుడు, దాసు, సతీషు పాల్గొన్నారు.


నారాయణపేట:- జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కూడలిలో నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసనలో ఐఎటీయు నాయకులు ఎం. హన్మేశ్, పీవైఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కాశీనాథ్, నాయకులు నర్సిములు, ఎదిరింటి నర్సింహా తదితరులు పాల్గొన్నారు.


దేవరకద్ర:- రైల్వే స్టేషన్ దగ్గర ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు గణేష్ , కొల్ల అంజన్న, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. 


యాదాద్రి భువనగిరి:- ఆలేరు రైల్వే స్టేషన్ ముందు ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఐఎప్రియు సహాయ కార్యదర్శి ఆర్ జనార్దన్ నాయకత్వం వహించాడు. ఐఎసీయు జిల్లా నాయకులు సుదర్శన్, పి రమేష్, శ్రీను, ఏ వెంకటేష్, నరేష్, భాస్కర్లు పాల్గొన్నారు.


నల్లగొండ:- రైల్వే స్టేషన్ ముందు నాయకులు నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాగేష్ , చారి, కే వెంకన్న, డి నరసింహ, శంకర్ తదితరులు పాల్గొన్నారు. పిడిఎస్ యు సాగర్ కూడా మద్దతు తెలియజేశారు.


వరంగల్:- వరంగల్ రైల్ స్టేషన్ ముందు రైలు రూట్ల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఈ కార్యక్రమంలో రాజు, పసునూరి రాజు, బాలాజీ, బయ్యన్న, ఫణి మరియు రమేషన్లు పాల్గొన్నారు


మహబూబాబాద్:- రైలు రూట్ల ప్రైవేటీకరణను నిరసిస్తూ ఇప్లు పిలుపులో భాగంగా రైల్వే స్టేషన్ ముందు నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పి సూర్యనారాయణ, శ్రీధర్, జి. యాకయ్య, లింగయ్య, యాకయ్య, భాస్కర్ రెడ్డి, టి.దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.


బయ్యారం:- బయ్యారం మండల కేంద్రంలో మన కార్యాలయం ముందు కేంద్ర ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ నిరసన వ్యక్తం చేశారు దీనికి వీరభద్రం నాయకత్వం వహించారు


రామగుండం:- రామగుండం రైల్వే స్టేషన్ ముందు నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఐఎసీయూ రాష్ట్ర సభ్యులు వెంకన్న జిల్లా నాయకులు అశోక్, రాజమల్లు, మల్లేష్, లింగమూర్తి తదితరులు పాల్గొన్నారు.


పెద్దపల్లి:- రైల్వే స్టేషన్ ముందు నిరసన వ్యక్తం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఐఎటీయు రాష్ట్ర కమిటీ సభ్యులు నరేష్ జిల్లా నాయకులు రమేష్, ధర్మ, గుమ్మడి వెంకన్నలు పాల్గొన్నారు.